హోలీ వేళ.. ఓటీటీలో సర్‌ప్రైజ్‌లు..
థియేటర్‌లో అలరించిన చిత్రాలు ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తుంటారు. కొన్ని సినిమాలు ఓటీటీలోకి సైలెంట్‌గా వచ్చేస్తున్నాయి. మరికొన్ని సినిమాలేమో చెప్పిన తేదీ కంటే ముందే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. హోలీ సందర్భంగా అభిమానులకు కొన్ని సినిమాలు సర్‌ప్రైజ్‌లు ఇచ్చాయి. మార్చి 17న రావాల్సిన ‘ఎమర్జెన్సీ’ మార్చి 14నే వచ్చేసింది (Holi Special OTT). మరోవైపు నేడు రావాల్సిన ‘ఏజెంట్’.. నిన్నే ప్రేక్షకులను పలకరించింది. దీంతో ఈ వీకెండ్ ఆడియన్స్‌కు వినోదం రెట్టింపు అయింది.
మూడు రోజుల ముందే ఎంట్రీ..

ఇటీవల ఎన్నో వివాదాలకు తెరతీసింది కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ (Emergency) సినిమా. జనవరి 17న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైన ఈ సినిమా మార్చి 17 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుందని తెలిపారు. కానీ, డిజిటల్ ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తూ.. మార్చి 14 నుంచే అందుబాటులోకి వచ్చేసింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ‘ఎమర్జెన్సీ’ చిత్రాన్ని రూపొందించారు (Emergency OTT). అత్యవసర పరిస్థితి ప్రకటించిన సందర్భాన్ని ఆధారంగా చేసుకొని దీనిని సిద్ధం చేశారు. ఇందిరాగాంధీగా కంగనా నటించగా.. జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్‌పేయీగా శ్రేయాస్ తల్పడే నటించారు.
ఒకరోజు ముందే ఏజెంట్ వచ్చేశాడు..

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన ‘ఏజెంట్’ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని అభిమానులు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. మరోవైపు ఓటీటీలోనూ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు మార్చి 14వ తేదీ నుంచి సోనీలివ్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు ఇటీవల ప్రకటించారు. తాజాగా అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ ఇంకాస్త ముందుగానే ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం సాయంత్రం నుంచే సోనీలివ్ దీనిని అందుబాటులోకి తెచ్చింది. అఖిల్ (Akhil Akkineni) కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. సాక్షి వైద్య కథానాయిక. మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఇది రూపొందింది.
వీటితో పాటు మరికొన్ని చిత్రాలు ఈ హోలీకి అభిమానులకు ఆనందాన్నిచ్చేందుకు సిద్ధమయ్యాయి. అవేంటంటే.. ఏ ఓటీటీలో అంటే..
- ఆజాద్ - నెట్‌ఫ్లిక్స్
- బీ హ్యాపీ - అమెజాన్ ప్రైమ్
- పోన్‌మ్యాన్ - జియోహాట్‌స్టార్
- మోనా 2 - జియోహాట్‌స్టార్
- రేఖా చిత్రం - ఆహా
- బ్రహ్మా ఆనందం - ఆహా
- రామం రాఘవం - ఈటీవీ విన్
- అనోరా - జియో హాట్‌స్టార్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

ఓటీటీలోకి మలయాళం సెటైరికల్ డ్రామా మూవీ.. తెలుగులోనూ
మలయాళం సినిమా ‘పెన్నుమ్ పోరాట్టమ్’ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. -

ఓటీటీలో ఈ వారం
కొత్తవారం మొదలైదంటే చాలు.. ఓటీటీల్లో అలరించేందుకు కొత్త కంటెంట్ ఏం వస్తుందా? అని ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా.. నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్తో మేమూ సిద్ధమే అంటున్నాయి ఓటీటీలు. -

ఎట్టకేలకు ఓటీటీలోకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’..
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. -

ఓటీటీలోకి ‘ఫంకీ’.. కామెడీ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విశ్వక్సేన్ హీరోగా నటించిన ‘ఫంకీ’ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. -

‘ఉస్తాద్ భగత్‌సింగ్’.. 20 నిమిషాల్లో ఓటీటీ డీల్..
‘ఉస్తాద్ భగత్ సింగ్’గా ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు పవన్ కల్యాణ్. -

ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు వచ్చేశాయ్!
ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి పలు ఆసక్తికర చిత్రాలు వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి. మరి ఏ ఓటీటీలో ఏ మూవీ అందుబాటులోకి వచ్చిందో చూసేయండి.. -

స్ట్రీమింగ్కు సిద్ధమైన ‘నవాబ్స్ కేఫ్’.. హార్ట్ టచింగ్ మూవీ ఏ ఓటీటీలో అంటే?
‘నవాబ్స్ కేఫ్’ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. -

ఓటీటీలోకి మరో రొమాంటిక్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మరో రొమాంటిక్ కామెడీ మూవీ రాబోతోంది. -

‘డాటర్ ఆఫ్ ప్రసాద్‌రావు’ వ్యూస్.. మామూలు విషయం కాదు: రాజీవ్ కనకాల
‘డాటర్ ఆఫ్ ప్రసాద్‌రావు’ సిరీస్ సక్సెస్ మీట్లో రాజీవ్ కనకాల, ఉదయభాను తదితరులు సందడి చేశారు. -

నేరుగా ఓటీటీలోకి ‘మేడిన్ కొరియా’.. ఆసక్తిగా ట్రైలర్
ప్రియాంకా మోహన్ నటించిన ‘మేడిన్ కొరియా’ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. -

వినూత్న కంటెంట్‌తో జియో హాట్‌స్టార్.. ఐపీఎల్ వేళ 100 మైక్రో డ్రామాలు..
యువతరాన్ని ఆకట్టుకునేందుకు ఓటీటీ సంస్థలు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో వస్తున్నాయి. భారతీయులకు సినిమాలు, క్రికెట్ అంటే ఎంతటి ఆసక్తో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. -

ఓటీటీలోకి ‘తన్వి ది గ్రేట్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించిన ‘తన్వి ది గ్రేట్’ ఓటీటీలోకి వచ్చింది. -

ఓటీటీలో ఈ వారం
సినీప్రియుల్ని అలరించేందుకు థ్రిల్ పంచే కథలు.. భావోద్వేగాలు పండించే డ్రామాలు.. అదరగొట్టే యాక్షన్ చిత్రాలు, సిరీస్‌లతో సన్నద్ధమయ్యాయి ఓటీటీలు. -

ఓటీటీలోకి ‘విత్ లవ్’.. రొమాంటిక్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
రొమాంటిక్ కామెడీ మూవీ ‘విత్ లవ్’ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. -

ఓటీటీలోకి ‘గాంధీ టాక్స్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, అదితీ రావ్ హైదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గాంధీ టాక్స్’. -

ఈ వారం ఓటీటీలో 30కి పైగా చిత్రాలు/సిరీస్‌లు వచ్చేశాయ్!
ఈ వారం ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్కు వచ్చాయి. అవేంటో చూసేయండి. -

ఈటీవి విన్ 3.o.. క్రేజీ ప్రాజెక్ట్‌లను ప్రకటించిన ఓటీటీ
ఇటు కుటుంబమంతా చూసేలా వినోదాత్మక చిత్రాలు, అటు థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించేలా వెబ్‌సిరీస్‌లను తీసుకొస్తూ ఓటీటీ శకంలో దూసుకెళ్తోంది ఈటీవీ విన్ (ETV Win). -

వివాదాంశాల తమిళ చిత్రం.. ఓటీటీలో ‘హాట్‌స్పాట్ 2 మచ్’ తెలుగు వెర్షన్
తమిళ, మలయాళ చిత్రాలు ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నాయి. జనవరిలో తమిళంలో విడుదలై యువతను ఆకట్టుకున్న చిత్రం ‘హాట్‌స్పాట్ 2 మచ్’ (Hot Spot 2 Much). -

ఓటీటీలో ఈ వారం
నాన్‌స్టాప్ ఎంటర్టైన్ కోసం కొత్త కథల్ని సిద్ధం చేశాయి ఓటీటీ వేదికలు. ఎప్పటిలాగే ఈ వారాంతం కూడా వినోదాలు పంచడానికి రెడీ అంటున్నాయి. -

ఇసుక అక్రమ రవాణాపై ‘సుబేదార్’ పోరాటం.. ఓటీటీలోకి మరో యాక్షన్ థ్రిల్లర్
ప్రకృతి వనరుల దోపిడీలో ఇసుక అక్రమ రవాణా కూడా అత్యంత ముఖ్యమైనది. ప్రతి రాష్ట్రంలో ఇదొక పెద్ద మాఫియా.







