Huma qureshi: అప్పుడే ఇది రాయాలన్న ఆలోచన వచ్చింది

‘నేనొక నటిని. నాలోని సృజనాత్మక కళను ప్రేక్షకులకు తెలియజేసే సమయం వస్తే ఎలాంటి అవకాశం వచ్చిన వదులుకోను.

Updated : 08 Dec 2023 09:35 IST

‘నేనొక నటిని. నాలోని సృజనాత్మక కళను ప్రేక్షకులకు తెలియజేసే సమయం వస్తే ఎలాంటి అవకాశం వచ్చిన వదులుకోను. అది నటన పరంగానైనా, పుస్తకాన్ని రచించడమైనా, సినిమాను నిర్మించడమైనా సరే..’ అని అంటోంది బాలీవుడ్‌ కథానాయిక హూమా ఖురేషి. హిందీ సినిమాతో చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఈమె రచయితగా పరిచయం కానున్న సంగతి తెలిసింది. నటనే కాదు తనలోని రచయిత్రిని ‘జెబా: యాన్‌ యాక్సిడెంటల్‌ సూపర్‌హీరో’ అనే నవల ద్వారా అందరికీ పరిచయం చేసింది. తాను రచించిన ఆ నవలని తాజాగా 12వ బెంగళూరు లిటరేచర్‌ ఫెస్టివల్‌(బీఎల్‌ఎఫ్‌) వేడుకలో భాగంగా ఆవిష్కరించింది. ఈ సందర్భంగా హూమా మాట్లాడుతూ...‘1992 నుంచి 2019 మధ్య చోటుచేసుకున్న సంఘటనలతో రూపుదిద్దుకున్న ఒక ఫాంటసీ ఫిక్షన్‌ నవల. అతీత శక్తులున్న జెబా అనే అమ్మాయి చెడు ప్రవర్తన కలిగి ఉన్న రాజును ఎలా ఎదుర్కొంది?’ అనే కథనంతో ఈ పుస్తకం మీ ముందుకొస్తుంది. ‘లీలా’ అనే టెలివిజన్‌ సిరీస్‌ చేస్తున్నప్పుడు ఈ కథ రాయాలన్న ఆలోచన వచ్చింది. ఈ పుస్తకాన్ని ఏదో ఒకరోజు సినిమాగా ప్రేక్షకులకు అందించాలని నా కోరిక. నాలోని సృజనత్మక కళను చూపించడానికి ఎలాంటి అవకాశం వచ్చిన వదులుకోను. ఇందులో నా వ్యక్తిగత విషయాలను కూడా జోడించాను’ అని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని