HUNT: ఇకపై విభిన్నంగానే ప్రయత్నిస్తా
‘‘హంట్’ (HUNT) ఓ విభిన్నమైన చిత్రం. దీన్ని ప్రారంభిస్తున్నప్పుడు ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారోనని భయపడ్డాం. కానీ, ఇప్పుడు సినిమా చూసి ప్రతి ఒక్కరూ అద్భుతమని చెబుతున్నారు.
‘‘హంట్’ (HUNT) ఓ విభిన్నమైన చిత్రం. దీన్ని ప్రారంభిస్తున్నప్పుడు ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారోనని భయపడ్డాం. కానీ, ఇప్పుడు సినిమా చూసి ప్రతి ఒక్కరూ అద్భుతమని చెబుతున్నారు. చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు సుధీర్‌బాబు (Sudheer Babu). ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని మహేష్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. వి.ఆనంద ప్రసాద్ నిర్మాత. శ్రీకాంత్ (Srikanth), భరత్(Bharath) కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవల విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో సుధీర్‌బాబు మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ద్వితీయార్ధంలో చివరి 30నిమిషాలు అద్భుతమని చెబుతున్నారు. అందరికీ కృతజ్ఞతలు. నేనిప్పటి వరకు అన్నీ విభిన్నమైన సినిమాలే చేశాను. ఇకపైనా అలాగే చేస్తాను. రెగ్యులర్ చిత్రాలు చేయను’’ అన్నారు. ‘‘కంటెంట్ సినిమాల కోసం చూసే ప్రేక్షకులకు సరైన చిత్రమిది. సుధీర్‌బాబు కొత్తగా ప్రయత్నించార’’న్నారు నటుడు భరత్. దర్శకుడు మహేష్ మాట్లాడుతూ.. ‘‘నేనప్పటికీ గర్వపడే సినిమా ఇది. తెలుగులో ఇలాంటి చిత్రం చేయడం ఇదే తొలిసారి. ఈతరహా పాత్రని సుధీర్ చేసినందుకు అందరూ మెచ్చుకుంటున్నారు’’ అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Umesh Yadav: అదే నా చివరి టోర్నీ.. ఛాన్స్‌ను మిస్ చేసుకోను: ఉమేశ్ యాదవ్
-
India News
Rajasthan: వారంతా నిర్దోషులే.. రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు!
-
Movies News
Allari Naresh: నాకు అలాంటి కామెడీ ఇష్టం.. అల్లరి నరేశ్‌కి అనిల్ రావిపూడి తోడైతే!
-
Sports News
David Warner: ‘డేవిడ్ వార్నర్‌ను వదిలేసి సన్‌రైజర్స్ పెద్ద తప్పు చేసింది’
-
Crime News
IPS Officer: విచారణలో మర్మాంగాలపై దాడి.. ఐపీఎస్ అధికారిపై వేటు!
-
India News
Karnataka: కోలార్ నుంచీ పోటీ చేస్తా: సిద్ధరామయ్య ప్రకటన