Vishal: వరలక్ష్మి శరత్‌కుమార్‌ నిశ్చితార్థం.. విశాల్ ఏమన్నారంటే..?

కోలీవుడ్‌ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar) త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు విశాల్‌ (Vishal) స్పందించారు.

Published : 15 Apr 2024 18:13 IST

హైదరాబాద్‌: సినీనటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar) త్వరలో పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. ప్రముఖ గ్యాలరిస్ట్‌ నికోలయ్‌ సచ్‌దేవ్‌తో ఇటీవల ఆమె నిశ్చితార్థం జరిగింది. దీనిపై తాజాగా నటుడు విశాల్‌ (Vishal) స్పందించారు. ఆమె వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నందుకు సంతోషంగా ఉన్నానని చెప్పారు. మరీ ముఖ్యంగా, కెరీర్‌పరంగా ఆమె అనుకున్నది సాధించిందని తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు ప్రఖ్యాతులు అందుకుందని అందుకు తానెంతో ఆనందంగా ఉన్నానని చెప్పారు. ‘హను-మాన్‌’లో వరలక్ష్మి ఫైట్స్‌ కూడా చేయడం బాగుందన్నారు.

‘పందెంకోడి 2’ కోసం విశాల్‌ - వరలక్ష్మి కలిసి వర్క్‌ చేశారు. ఆ సినిమా షూట్‌ సమయంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని జోరుగా ప్రచారం సాగింది. ఆ సమయంలో విశాల్‌ పుట్టినరోజును ఆమె ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేయడం ఆ కథనాలకు ఆజ్యం పోసినట్లయింది. తమ గురించి జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని.. తాము కేవలం చిన్ననాటి స్నేహితులం మాత్రమేనని అప్పట్లో ఈ జోడీ క్లారిటీ ఇచ్చింది. సినిమాల విషయానికి వస్తే.. విశాల్‌ ప్రస్తుతం ‘రత్నం’ రిలీజ్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 26న విడుదల కానుంది. మరోవైపు, ‘హనుమాన్‌’తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు వరలక్ష్మి. ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘శబరి’ త్వరలో విడుదల కానుంది. ధనుష్‌ హీరోగా నటిస్తోన్న చిత్రంలోనూ ఆమె కీలకపాత్ర పోషిస్తున్నారు. దాదాపు 15 ఏళ్ల నుంచి నికోలయ్‌తో తనకు పరిచయం ఉందని.. ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకుంటామని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వరలక్ష్మి స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని