Vishal: 2026 ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తా: పొలిటికల్‌ ఎంట్రీపై విశాల్‌ వ్యాఖ్యలు

తన రాజకీయ అరంగేట్రంపై నటుడు విశాల్‌ (Vishal) కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు చెప్పారు.

Published : 14 Apr 2024 14:03 IST

చెన్నై: పొలిటికల్‌ ఎంట్రీపై నటుడు విశాల్‌ (Vishal) కీలక వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ‘‘త్వరలోనే నేను రాజకీయాల్లోకి వస్తున్నా. పార్టీని స్థాపించి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా. ప్రస్తుతం ప్రజలకు సరైన వసతుల్లేవు. వారికి సేవ చేసి.. అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నా’’ అని ప్రకటించారు. ‘ఏ రాజకీయ పార్టీతోనైనా పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా?’ అని ప్రశ్నించగా.. ‘‘అలాంటిదేమీ లేదు. ముందు నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నా. ఆ తర్వాతే మిగిలిన విషయాలు, పొత్తు గురించి ఆలోచిస్తా’’ అని బదులిచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తమిళనాడులో చర్చనీయాంశంగా మారాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని