Indian 2: ‘భారతీయుడు 2’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ లుక్‌తో అజిత్‌

కమల్‌ హాసన్‌ నటించిన ‘భారతీయుడు 2’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. అజిత్‌ నటిస్తున్న ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ చిత్రంలోని ఆయన ఫస్ట్‌ లుక్‌ రిలీజైంది.

Published : 19 May 2024 22:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ ప్రముఖ హీరోలు కమల్‌ హాసన్‌ (Kamal Haasan), అజిత్‌ (Ajith Kumar) సినీ ప్రియులకు సర్‌ప్రైజ్‌లు ఇచ్చారు. తమ కొత్త చిత్రాల విడుదల అప్‌డేట్స్‌ని పంచుకున్నారు. కమల్‌- ప్రముఖ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన హిట్‌ మూవీ ‘భారతీయుడు’ (bharateeyudu). దానికి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ (bharateeyudu 2) రూపొందిన సంగతి తెలిసిందే. కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సిద్ధార్థ్‌ కీలక పాత్రలు పోషించారు. కొన్ని సంవత్సరాల క్రితమే ప్రారంభమైన ఈ సినిమా పలు కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. జులై 12న (Indian 2 Release Date) ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు కమల్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. తొలి పాటను ఈ నెల 22న రిలీజ్‌ చేయనున్నట్టు తెలిపారు.

అజిత్‌ హీరోగా దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌ రూపొందిస్తున్న సినిమా ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ (Good Bad Ugly). ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న సినిమాలోని అజిత్‌ లుక్‌ని టీమ్ విడుదల చేసింది. అందులో ఆయన కొత్తగా కనిపించారు. రెండు చేతుల నిండా టాటూలు, హెయిర్‌ స్టైల్‌తో ఆకట్టుకునేలా ఉన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా తెలుగు, తమిళ్‌లో విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు