Indian 2: నిప్పులుగక్కే ఖడ్గం నీదే...

‘‘శిరసెత్తే శిఖరం నువ్వే... నిప్పులు గక్కే ఖడ్గం నీదే... కసిరెక్కల గుర్రంపైన కదిలొచ్చే భూకంపం నువ్వే...’’ అంటూ భారతీయుడి పరాక్రమాన్ని చాటి చెప్పే పాట విడుదలైంది.

Published : 23 May 2024 06:02 IST

‘‘శిరసెత్తే శిఖరం నువ్వే... నిప్పులు గక్కే ఖడ్గం నీదే... కసిరెక్కల గుర్రంపైన కదిలొచ్చే భూకంపం నువ్వే...’’ అంటూ భారతీయుడి పరాక్రమాన్ని చాటి చెప్పే పాట విడుదలైంది. మరి భారతీయుడు చేసిన విన్యాసాలు, ఆయన తెగువ ఎలాంటిదో ‘భారతీయుడు 2’ చూసి తెలుసుకోవల్సిందే. కమల్‌హాసన్‌ కథానాయకుడిగా, శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. కాజల్‌ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్‌ సింగ్, ప్రియ భవానీ శంకర్, ఎస్‌.జె.సూర్య కీలక పాత్రల్లో నటించారు. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మించారు. శౌర... అంటూ సాగే పాటని బుధవారం విడుదల చేశారు. సుద్దాల అశోక్‌తేజ రచించిన ఈ పాటని,   అనిరుధ్‌ రవిచందర్‌ స్వరపరచగా,  రితేశ్‌ జి.రావ్, శ్రుతికా సముద్రాల ఆలపించారు. ‘భూతల్లిపై ఒట్టేయ్‌... తెలుగోడి వాడి చూపెట్టేయ్‌... తెల్లోడి నెత్తురితోనే నీ కత్తికి పదునుపెట్టేయ్‌...’ అంటూ ఈ పాట సాగుతుంది. 1996లో కమల్‌హాసన్, శంకర్‌ కలయికలో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ‘భారతీయుడు’కి కొనసాగింపుగా రూపొందిన చిత్రమిది. జులై 12న తెలుగు, తమిళంతోపాటు  హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. జూన్‌ 1న చెన్నైలో పాటల విడుదల వేడుకని నిర్వహిస్తారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని