Indian Police Force: ఆకట్టుకునేలా ‘ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌’ ట్రైలర్‌

అమెజాన్‌ ఒరిజినల్‌గా సిద్ధమైన సరికొత్త సిరీస్‌ ‘ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌’ (Indian Police Force). తాజాగా ఈ సిరీస్‌ ట్రైలర్‌ విడుదలైంది.

Updated : 05 Jan 2024 16:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పోలీస్‌ కథలతో తరచూ ప్రేక్షకులను అలరిస్తుంటారు బాలీవుడ్‌ దర్శకుడు రోహిత్‌ శెట్టి (Rohit Shetty). తాజాగా ఆయన తెరకెక్కించిన పవర్‌ఫుల్‌ పోలీస్‌ సిరీస్‌ ‘ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌’ (Indian Police Force). సిద్ధార్థ్‌ మల్హోత్ర, శిల్పాశెట్టి, వివేక్‌ ఒబెరాయ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. అమెజాన్‌ ప్రైమ్‌ ఒరిజినల్‌గా సిద్ధమైన ఈ సిరీస్‌ జనవరి 19 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలోనే ‘ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. దేశ ప్రజలను సంరక్షించడం కోసం నిరంతరం శ్రమిస్తున్న భారతీయ పోలీసు అధికారుల నిస్వార్థ సేవలకు అద్దం పట్టేలా ఈ సిరీస్‌ను తీర్చిదిద్దారు. దాదాపు ఏడు ఎపిపోడ్స్‌తో సిద్ధమైన ఈ సిరీస్‌కు రోహిత్‌శెట్టితోపాటు సుశ్వంత్ ప్రకాష్ దర్శకుడిగా వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని