Lokesh Kanagaraj: నటుడిగా లోకేశ్‌ కనగరాజ్‌.. వీడియో వైరల్‌

కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) నటుడిగా మారారు. శ్రుతిహాసన్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. 

Published : 22 Mar 2024 12:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఖైదీ’ ‘విక్రమ్‌’ లాంటి చిత్రాలతో కోలీవుడ్‌ స్టార్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj). ఇప్పుడాయన నటుడిగా మారారు. శ్రుతిహాసన్‌తో కలిసి ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం వర్క్ చేశారు. ‘ఇనిమేల్’ అంటూ సాగే ఈ పాట ప్రోమో తాజాగా విడుదలైంది. వీరి కెమిస్ట్రీ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘‘ఇది మా దర్శకుడు లోకేశ్‌ కనగరాజేనా..?’’, ‘‘రొమాంటిక్‌ సీన్స్‌ రాయడంలో పెద్దగా నాలెడ్జ్‌ లేదని చెప్పిన ఆయనేనా ఈయన..?’’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. ఈ పాటకు కమల్‌హాసన్‌ లిరిక్స్ అందించారు. ద్వారకేశ్‌ ప్రభాకర్‌ దర్శకత్వం వహించారు. మార్చి 25న ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదల చేయనున్నారు.

గతేడాది ‘లియో’తో ప్రేక్షకులను అలరించిన లోకేశ్‌ కనగరాజ్‌.. ప్రస్తుతం తదుపరి సినిమా స్క్రిప్ట్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. రజనీకాంత్‌ హీరోగా ఇది తెరకెక్కనుంది. జీ స్క్వార్డ్‌ నిర్మాణ సంస్థను ప్రారంభించిన ఆయన.. దాని ద్వారా కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. ‘సలార్‌’లో ఆద్యగా మెప్పించిన శ్రుతిహాసన్‌.. ‘సలార్‌ 2’ కోసం వర్క్‌ చేయనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని