New Movies and Series: ఓటీటీలో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ ‘కాంతారా2’, ‘ఫ్యామిలీస్టార్‌’.. అమెజాన్‌ ప్రైమ్‌ క్రేజీ అప్‌డేట్స్‌

Amazon Prime Video: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా సందడి చేయబోయే సినిమాల జాబితాను సదరు ఓటీటీ సంస్థ పంచుకుంది.

Published : 20 Mar 2024 00:09 IST

హైదరాబాద్‌: ప్రముఖ ఓటీటీ వేదికగా అమెజన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video) ఆసక్తికకర అప్‌డేట్స్‌ను పంచుకుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న సరికొత్త చిత్రాలు థియేట్రికల్‌ రన్‌ పూర్తయిన తర్వాత ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు ప్రకటించింది. మంగళవారం ముంబయి వేదికగా జరిగిన ఈవెంట్‌లో ప్రైమ్‌లో రాబోయే సినిమాలు, సిరీస్‌ల జాబితాను ప్రకటించింది. క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’, రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాంతార: చాప్టర్‌-1’, శివ తెరకెక్కిస్తున్న సూర్య మూవీ ‘కంగువా’ థియేట్రికల్‌ రన్‌ ముగిసిన తర్వాత అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో సందడి చేయనున్నారు. అలాగే రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’, నితిన్‌ ‘తమ్ముడు’, ‘ఓం భీమ్‌ బుష్‌’ తదితర చిత్రాలు ప్రైమ్‌లోనే సందడి చేయనున్నాయి.

ఇక వెబ్‌సిరీస్‌ల విషయానికొస్తే, ఏ వతన్‌ మేరీ వతన్‌, ఇన్‌స్పెక్టర్‌ రిషి, సిటాడెల్‌: హనీ బన్నీ, స్నేక్స్‌ అండ్‌ లేడర్స్‌, గంగాస్‌ కృతి పునల్‌, బీ హ్యాపీ, కవూఫ్‌, అందేరా, ది మెహతా బాయ్స్‌, ధూపాహియా, దిల్‌ దోస్తీ డైలమా, కాల్‌ మి బే, ఫాలో కర్‌లో యార్‌, మీర్జా పూర్‌-3, షుజల్‌: ది వార్టెక్స్‌-2, పాతాళ్‌ లోక్‌-2, బందిష్‌ బండిట్స్‌, పంచాయత్‌-3, గుల్‌కంద్‌ టేల్స్‌, ది రానా కనెక్షన్‌, ఇన్‌ ట్రాన్సిస్ట్‌, రంగీన్‌, మట్కా కింగ్‌, దల్‌దల్‌, డేరింగ్‌ పార్ట్‌నర్స్‌, రెవల్యూషనరీస్‌, అరేబియా కడలి, ది గ్రేట్‌ ఇండియన్‌ కోడ్‌, సుబేదార్‌, ఉప్పు కప్పురంబు, చీకట్లో, ది ట్రైబ్‌, బ్యాండ్‌వాలా, వాక్‌ గర్ల్స్‌, జిద్దీ గర్ల్స్‌, మా క సమ్‌, సూపర్‌మెన్‌ ఆఫ్‌ మాలెగావ్‌, సివరపల్లి, చోరీ2 తదితర సిరీస్‌లు అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కాబోయే చిత్రాలు/సిరీస్‌లు

 • చిత్రం: ఉస్తాద్‌భగత్‌ సింగ్‌; నటీనటులు: పవన్‌కల్యాణ్‌, శ్రీలీల; దర్శకత్వం: హరీశ్‌ శంకర్‌; నిర్మాత: వై.రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని
 • చిత్రం: గేమ్‌ ఛేంజర్‌; నటీనటులు: రామ్‌చరణ్‌, కియారా అడ్వాణీ, ఎస్‌జే సూర్య; దర్శకత్వం: శంకర్‌; నిర్మాత: దిల్‌ రాజు, శిరీష్‌, జీ స్టూడియోస్‌
 • చిత్రం: అశ్వత్థామ; నటీనటులు: షాహిద్‌ కపూర్‌; దర్శకత్వం: సచిన్‌ బి రవి; నిర్మాత: వాసు భగ్నానీ, జాకీ భగ్నానీ, దీప్షిక దేశ్‌ముఖ్‌
 • చిత్రం: ఘాటి; నటీనటులు: అనుష్కశెట్టి; దర్శకత్వం: క్రిష్‌; నిర్మాత: వంశీకృష్ణారెడ్డి, రాజీవ్‌రెడ్డి
 • చిత్రం: తమ్ముడు; నటీనటులు: నితిన్‌, సప్తమి, లయ; దర్శకత్వం: వేణు శ్రీరామ్‌; నిర్మాత: దిల్‌రాజు
 • చిత్రం: ఫ్యామిలీస్టార్‌; నటీనటులు: విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌; దర్శకత్వం: పరశురామ్‌; నిర్మాత: దిల్‌రాజు, శిరీష్‌
 • చిత్రం: బాఘీ4; నటీనటులు: టైగర్‌ ష్రాప్‌; నిర్మాత: సాజిద్‌ నడియాద్‌వాలా
 • చిత్రం: హౌస్‌ఫుల్‌ 5; నటీనటులు: అక్షయ్‌కుమార్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్‌; దర్శకత్వం: తరుణ్‌ మన్సుఖాని; నిర్మాత: సాజిద్‌ నడియాద్‌వాలా; విడుదల: జూన్‌ 6, 2025
 • చిత్రం: చందు ఛాంపియన్‌; నటీనటులు: కార్తిక్‌ ఆర్య; దర్శకత్వం: కబీర్‌ఖాన్‌; నిర్మాత: సాజిద్‌ నడియాద్‌వాలా, కబీర్‌ఖాన్‌; విడుదల: జూన్‌ 14, 2024
 • చిత్రం: ఇక్కీస్‌; నటీనటులు: అగస్త్య నంద, ధరేంద్ర, జైదీప్‌ అహల్వత్‌; దర్శకత్వం: శ్రీరామ్‌ రాఘవన్‌; నిర్మాత: దినేష్‌ విజాన్‌
 • చిత్రం: స్త్రీ; నటీనటులు: షాహిద్‌ కపూర్‌, రాజ్‌ కుమార్‌ రావ్‌, పంకజ్‌ త్రిపాఠి, అభిషేక్‌ బెనర్జీ; దర్శకత్వం: అమర్‌ కౌశిక్‌; నిర్మాత: దినేష్‌ విజాన్‌, జ్యోతి దేశ్‌పాండే
 • చిత్రం: తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా; నటీనటులు: షాహిద్‌ కపూర్‌, కృతి సనన్‌, ధర్మేంద్ర, డింపుల్‌ కపాడియా; దర్శకత్వం: అమిత్‌ జోషి, ఆరాధన షా; నిర్మాత: దినేష్‌ విజాన్‌, జ్యోతి దేశ్‌పాండే, లక్ష్మణ్‌ ఉటేకర్‌

 • వెబ్‌ సిరీస్‌: చోరీ2; నటీనటులు: నుస్రత్‌ బరూచా, సోహా అలీఖాన్‌; దర్శకత్వం: విశాల్‌ ఫరియా

 • వెబ్‌ సిరీస్‌: ది మెహతా బాయ్స్‌ (The Mehta Boys); నటీనటులు: బొమన్‌ ఇరానీ, అవినాష్‌ తివారీ, శ్రేయా చౌదరి; దర్శకత్వం: బొమన్‌ ఇరానీ; నిర్మాత: వికేశ్‌ భూతాని, షుజాత్‌ సౌదాగర్‌, దానిష్‌ ఇరానీ, బొమన్‌ ఇరానీ
 • వెబ్‌ సిరీస్‌: బి హ్యాపీ; నటీనటులు: అభిషేక్‌ బచ్చన్‌, నోరా ఫతేహి, నాజర్‌, ఇనాయత్‌ వర్మ; దర్శకత్వం: రెమో డిసౌజా; నిర్మాత: లిజెల్లీ రెమో డిసౌజా

 • వెబ్‌ సిరీస్‌: సుబేదార్‌; నటీనటులు: అనిల్‌కపూర్‌; దర్శకత్వం: సురేష్‌ త్రివేణి; నిర్మాత: విక్రమ్‌ మల్హోత్ర, సురేష్‌ త్రివేణి, అనిల్‌ కపూర్‌

 • వెబ్‌ సిరీస్‌: చీకట్లో; దర్శకత్వం: చంద్ర పెమ్మరాజు; నిర్మాత: సురేష్‌బాబు

 • వెబ్‌ సిరీస్‌: ఉప్పు కప్పురంబు; నటీనటులు: సుహాస్‌, కీర్తి సురేష్‌; దర్శకత్వం: అని ఐ.వి. శశి; నిర్మాత: రాధిక లావు
 • వెబ్‌ సిరీస్‌: గుల్‌కందా; నటీనటులు: కునాల్‌ ఖేము, పంకజ్‌ త్రిపాఠి, పత్రలేఖ; దర్శకత్వం: రాహి అనిల్‌ బ్రావే; నిర్మాత: డీ2ఆర్‌ ఫిల్మ్‌ (రాజ్‌ అండ్‌ డీకే)
 • వెబ్‌ సిరీస్‌: మా కా సమ్‌; దర్శకత్వం: నికోలస్‌ ఖార్కోంగోర్‌; నిర్మాత: బబితా అశ్విల్‌
 • వెబ్‌ సిరీస్‌: వాక్‌ గర్ల్స్‌; నటీనటులు: మెకోలా బోస్‌, రిటాషా రాఠోడ్‌, బరూన్‌ చందా, అనసూయ చౌదరి, క్రిసాన్‌ పెరియా, ప్రియమ్‌ సాహా, రుబీ  షా, అంచిత్య బోస్‌; దర్శకత్వం: సూనీ తారా పోర్‌వాలే
 • వెబ్‌ సిరీస్‌: జిద్ది గర్ల్స్‌; నటీనటులు: సిమ్రన్‌ బగ్గా, రేవతి, నందితాదాస్‌, నందిష్‌ సంధు, అనుప్రియ కరోలి, అతియా తారా నాయక్‌, ఆయుషి రావత్‌, జైనా అలీ, ఉమాంగ్‌ బదానా; దర్శకత్వం: సోహనాలి బోస్‌, నేహా వీణా శర్మ, వనంత్‌ నాథ్‌; నిర్మాత: ప్రితేష్‌ నంది
 • వెబ్‌ సిరీస్‌: బ్యాండ్‌వాలీ; నటీనటులు: షాలినీ పాండే, జహాన్‌ కపూర్‌, స్వానంద్‌, సంజన్‌ దీపూ, ఆశిష్‌ విద్యార్థి, అనుపమ కుమార్‌; దర్శకత్వం: అక్షత్‌ వర్మ; అంకుర్‌ తివారీ
 • వెబ్‌ సిరీస్‌: దిల్‌ దోస్తీ డైలమా; నటీనటులు: అనుష్క సేన్‌, తన్వి అజ్మి, షీషిర్‌ శఱ్మ, సుహాసిని ములే; దర్శకత్వం: డెబ్బీరావు
 • వెబ్‌ సిరీస్‌: ఫాలో కర్‌లో యార్‌; నటీనటులు: ఉఫ్రి జావేద్‌; దర్శకత్వం: సందీప్‌ కుక్రేజా; నిర్మాత: ఫాజిలా అల్లనా, కామ్నా మెంజెస్‌
 • వెబ్‌ సిరీస్‌: ది ట్రైబ్‌; నటీనటులు: అలనా పాండే, అలవీయా జాఫ్రీ, శ్రుతి పోరే, అల్ఫియా జాఫ్రే, ఆర్యానా గాంధీ, హార్దిక్‌ ఝవేరి; దర్శకత్వం: ఓంకార్‌ పొద్దర్‌; నిర్మాత: కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా, అనీష్‌ బేగ్‌
 • వెబ్‌ సిరీస్‌: కాల్‌ మి బే; నటీనటులు: అనన్య పాండే, విర్‌దాస్‌, గుర్‌ఫతే పీర్జాదా, వరుణ్‌ సూద్‌; దర్శకత్వం: కొల్లిన్‌ డి కన్హా; నిర్మాత: కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా, సోమెన్‌ మిశ్రా
 • వెబ్‌ సిరీస్‌:డార్లింగ్‌ పార్ట్‌నర్స్‌; నటీనటులు: తమన్నా, డయానా పెంటీ, జావేద్‌ జెఫ్రీ; దర్శకత్వం: అర్చిత్‌కుమార్‌, నిషాంత్‌ నాయక్‌; నిర్మాత: కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా, సోమెన్‌ మిశ్రా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని