Aha: ఆహా వేదికగా ‘ఇంటింటి రామాయణం’.. అలరిస్తున్న టీజర్‌...

ఆహా వేదికగా ఇంటింటి రామాయణం డిసెంబర్‌ 16 నుంచి అలరించనుంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. 

Published : 25 Nov 2022 13:46 IST

హైదరాబాద్‌: థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు ఏమాత్రం తగ్గట్లేదు ఓటీటీ సినిమాలు. డిజిటల్‌ ప్రేక్షకులను అలరిస్తూ మంచి టాక్‌ తెచ్చుకుంటున్నాయి. తాజాగా మరో సినిమా ఓటీటీ విడుదలకు రెడీ అయింది. మారుతీ పర్యవేక్షణలో సురేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇంటింటి రామాయణం. ఆహా వేదికగా డిసెంబర్‌ 16 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. రాహుల్‌ రామకృష్ణ ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమాలో పలు సీరియల్స్‌లో కనిపించిన నవ్య స్వామి అలరించనుంది. ఇక తెలంగాణ యాసలో తన ప్రత్యేకతను చాటుకున్న గంగవ్వ ఇందులో కీలకపాత్రలో నటించింది. డీజే టిల్లు, బీమ్లానాయక్‌ వంటి బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలను నిర్మించిన సితార ఎంటర్‌టైనర్స్‌ ఈ చిత్రంతో ఓటీటీలోకి ప్రవేశించనుంది. మధ్యతరగతి కుటుంబాలలో సహజంగా జరిగే సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా టీజర్‌ యూట్యూబ్‌లో అలరిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని