Priyanka Mohan: కొత్త కలయిక కుదిరేనా!

కథానాయకుడు రవితేజ.. దర్శకుడు గోపీచంద్‌ మలినేని కలయికలో రూపొందనున్న నాలుగో చిత్రం ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది.

Updated : 29 Oct 2023 13:58 IST

కథానాయకుడు రవితేజ.. దర్శకుడు గోపీచంద్‌ మలినేని కలయికలో రూపొందనున్న నాలుగో చిత్రం ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. వచ్చే నెల నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలు కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కోసం కథానాయికను వెతికి పట్టుకునే పనిలో పడింది చిత్ర బృందం. ఇప్పుడిందు కోసం ప్రియాంక అరుల్‌ మోహన్‌ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. నిజానికి ఈ పాత్ర కోసం తొలుత రష్మికను సంప్రదించాయి చిత్ర వర్గాలు. కానీ, డేట్స్‌ సర్దుబాటు కాకపోవడం వల్ల ఆమె ఈ అవకాశాన్ని వదులుకున్నట్లు తెలిసింది. దీంతో ఆ అవకాశం ప్రియాంక వద్దకు వచ్చి చేరింది. ప్రస్తుతం చిత్ర బృందం ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న శక్తిమంతమైన కథతో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో రవితేజ మునుపెన్నడూ చూడని భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని