Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ వివాహం.. వేదిక మారడానికి కారణమదేనా?

బాలీవుడ్‌ నటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, నిర్మాత జాకీ భగ్నానీ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు.  వీరి వివాహ వేదిక మార్పుపై వార్తలొస్తున్నాయి. 

Published : 31 Jan 2024 20:38 IST

ముంబయి: సినీ ప్రముఖులు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet), జాకీ భగ్నానీ (Jackky Bhagnani) త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఫిబ్రవరి 22న పెళ్లి పీటలెక్కనుందని సమాచారం. వీరి వివాహ వేదిక మార్పుపై బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. విదేశాల్లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోవాలనే ప్లాన్‌లో ఉన్న వీరు తర్వాత నిర్ణయం మార్చుకున్నారని, గోవాలో చేసుకునేందుకు ఫిక్స్‌ అయ్యారని తెలిసింది. ‘‘రకుల్‌- జాకీ భగ్నానీ మిడిల్‌ ఈస్ట్‌లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ, ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఇండియాలో చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. చివరి నిమిషంలో వేదిక మార్చడం కష్టమే అయినా దేశంపై ఉన్న ప్రేమతో ఈ మార్పును వారు స్వీకరించారు’’ అని రకుల్‌, భగ్నానీ సన్నిహిత వర్గాలు తమకు చెప్పినట్లు ఓ మీడియా సంస్థ పేర్కొంది.

విదేశాల్లో వివాహ వేడుకలు (Destination Wedding) చేసుకోవాలనుకునే భారతీయ యువ జంటలకు ప్రధాని మోదీ (PM Modi) ఇటీవల కీలక సూచన చేసిన సంగతి తెలిసిందే. తమ జీవితంలో నూతన ప్రయాణాన్ని విదేశాల్లో ఎందుకు ప్రారంభిస్తున్నారని ప్రశ్నించారు. భారత్‌లో ఒక్కసారైనా డెస్టినేషన్‌ వెడ్డింగ్ చేశారా? అని దేశంలోని సంపన్న కుటుంబాల వారిని ప్రశ్నించారు. ‘మేకిన్‌ ఇండియా’ తరహాలో ‘వెడ్‌ ఇన్‌ ఇండియా’ ప్రారంభం కావాలన్నారు.

2013లో వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో విజయాన్ని ఖాతాలో వేసుకున్న రకుల్.. టాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌, కోలీవుడ్‌లో బిజీగా ఉన్నారు. ఆమె కీలక పాత్ర పోషించిన ‘ఇండియన్‌ 2’ (భారతీయుడు 2) విడుదలకు సిద్ధమవుతోంది. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో తాను రిలేషన్‌లో ఉన్నట్లు 2021లో ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని