Rana: నాని, శర్వానంద్‌ కాదట.. ఆ అవకాశం రానా అందుకుంటారా?

టాలీవుడ్‌ హీరోలు నాని, శర్వానంద్‌ వద్దనుకున్న ఓ అవకాశాన్ని రానా దగ్గుబాటి అందుకోనున్నారనే టాక్‌ ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. అది ఏ చిత్రమంటే?

Published : 06 Sep 2023 19:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ అగ్ర హీరో సినిమా ఖరారైతే చాలు రోజుకో రూమర్ బయటకొస్తుంటుంది. వారి అభిమానులు, సినీ ప్రియుల్లో ఆసక్తి కలుగుతుంది. రజనీకాంత్‌ (Rajinikanth) సినిమా విషయంలో ఇదే జరుగుతోంది. రజనీకాంత్‌- దర్శకుడు టి.జె. జ్ఞానవేల్‌ (TJ Gnanavel) కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘తలైవా 170’ (#Thalaivar 170) అనేది వర్కింగ్‌ టైటిల్‌. ఇందులో బాలీవుడ్‌ అగ్ర నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan)తోపాటు తెలుగు హీరో ఒకరు కీలక పాత్రలు పోషిస్తారనే వార్తలు కొన్ని రోజుల క్రితం చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో ముందుగా నాని పేరు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత, ఈ సినిమాలో నాని (Nani) నటించేందుకు అంగీకరించలేదని, దాంతో శర్వానంద్‌ (Sharwanand)ని తీసుకున్నారని మరో గాసిప్‌ వచ్చింది. శర్వానంద్‌ కూడా ఈ సినిమాలో నటించడంలేదని, ఆ స్థానంలోకి రానా (Rana Daggubati) చేరనున్నారనేది తాజా సమాచారం. మరి, చివరకు ఈ అవకాశాన్ని రానా అందుకుంటారా? మరో హీరోనా? అంటే అధికారిక ప్రకటన వెలువడాల్సిందే.

ఇష్టం లేక కాదు కానీ..: పెళ్లిపై నటి కీలక వ్యాఖ్యలు

‘జైలర్‌’ (Jailer)వంటి హిట్‌ తర్వాత రజనీకాంత్‌ నటిస్తుండటం, ‘జై భీమ్‌’ తర్వాత జ్ఞానవేల్‌ డైరెక్ట్‌ చేయబోయే సినిమాకావడంతో ‘తలైవా 170’పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కునున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైనట్లు తెలిసింది. ఈ చిత్రంలో మంజు వారియర్‌ కథానాయిక అని టాక్‌. మరోవైపు, మలయాళం చిత్ర పరిశ్రమ నుంచి ఫాహద్‌ ఫాజిల్‌ని తీసుకున్నారనే చర్చ నడుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని