Janhvi Kapoor: వాళ్ల సూటిపోటి మాటలతో బాధపడ్డా: జాన్వీకపూర్
అలనాటి నటి శ్రీదేవి, నిర్మాత బోనీకపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు జాన్వీకపూర్ (Janhvi Kapoor). నెట్టింట్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఆమె.. వాటిని ఏ మాత్రం లెక్కచేయకుండా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘గుడ్‌లక్ సఖి’, ‘మిలీ’ చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి.
ముంబయి: తన గురించి పలువురు నెటిజన్లు చేసిన వ్యాఖ్యలు ఎంతో బాధించాయని నటి జాన్వీకపూర్ (Janhvi Kapoor) అన్నారు. కొంతమంది తనని నెపోకిడ్ అంటూ సూటిపోటి మాటలు అన్నారని తెలిపారు. ‘‘మనం ఎంత కష్టపడినా సరే.. కొంతమంది వ్యక్తులు మనలో ఏదో ఒక తప్పు వెతికి విమర్శించడానికి చూస్తుంటారు. అలా, వాళ్లు ఆనందం పొందుతారు. వాళ్ల వ్యాఖ్యలతో మనం వార్తల్లో నిలుస్తాం. ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. దురదృష్టం కొద్ది.. కొన్నిరోజులయ్యే సరికి ఈ వార్తలు చదివి ప్రజలు విసిగిపోతారు’’ అని జాన్వీ అభిప్రాయపడ్డారు.
‘‘నేను కెరీర్ ఆరంభించినప్పటి నుంచి నెపోకిడ్ అనే విమర్శను ఎదుర్కొంటున్నాను. నా సినిమా రిలీజైనప్పుడల్లా కొంతమంది కావాలని.. ‘నెపోకిడ్.. నటన రానప్పుడు ఎందుకు సినిమాలు చేస్తున్నావు?’ అని ఘాటుగా ట్రోల్స్ చేశారు. వాటిని చూసి నేనెంతో బాధపడ్డా. అయితే, ఇప్పుడు సోషల్‌మీడియాలో వచ్చే ట్రోల్స్ చూసి నవ్వుకుంటున్నా. నా బలాలు, బలహీనతలు, నేను ఎలా నటిస్తున్నానో నాకు తెలుసు. కాబట్టి, వాళ్ల వ్యాఖ్యలు పట్టించుకోకూడదని అర్థమైంది. అలాగే గత రెండు చిత్రాల వల్ల నేనూ నటిగా నిరూపించుకున్నానని, నాక్కూడా అవకాశాలు వస్తాయని భావిస్తున్నాను’’ అని జాన్వీ కపూర్ తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: పల్లెటూరి అమ్మాయిగా దివి పోజు.. శ్రీముఖి ‘పింక్’ పిక్స్!
-
World News
Mexico-US Border: శరణార్థి శిబిరంలో ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది మృతి..!
-
Sports News
Cricket: నాన్‌స్ట్రైకర్ రనౌట్.. బ్యాట్ విసిరి కొట్టిన బ్యాటర్
-
General News
Amaravati: రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Chandra Babu: పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో రూపొందించాలి: చంద్రబాబు