NTR 30: ‘ఎన్టీఆర్ 30’లో హీరోయిన్గా జాన్వీకపూర్.. నెరవేరిన నటి కల
ఎన్టీఆర్ 30 సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్ (NTR) హీరోగా తెరకెక్కుతోన్న ఈసినిమాలో కథానాయికగా ఎవరు కనిపించనున్నారో చిత్రబృందం వెల్లడించింది.
హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. NTR 30వ ప్రాజెక్ట్‌గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో కథానాయికను చిత్రబృందం తాజాగా పరిచయం చేసింది.
శ్రీదేవి (Sridevi) పెద్ద కుమార్తె, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఇందులో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా కనిపించనుందని ప్రకటించింది. ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్ని సైతం షేర్ చేసింది. మరోవైపు, ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంపై జాన్వి సంతోషాన్ని వ్యక్తం చేసింది. ‘‘ఎట్టకేలకు ఇది జరుగుతోంది. నేను ఎంతగానో అభిమానించే ఎన్టీఆర్‌తో కలిసి సందడి చేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా’’ అని ఆమె పేర్కొంది.
ఎన్టీఆర్ అంటే తనకెంతో ఇష్టమని.. ఆయనతో కలిసి నటించాలని ఉందని జాన్వీకపూర్ ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు. #NTR 30లో అవకాశం వస్తే చేస్తానని ఆమె గతంలోనే చెప్పారు. తాజా ప్రకటనతో ఆమె కల నెరవేరినట్లు అయ్యింది. జాన్వీకపూర్‌కు ఇదే తొలి తెలుగు చిత్రం. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ పతాకంపై ఈసినిమా రూపుదిద్దుకుంటోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TSPSC: పేపర్ లీకేజీపై తాజా నివేదిక ఇవ్వండి: తమిళి సై
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Navjot Singh: సిద్ధూ భార్యకు క్యాన్సర్.. ‘ఇక వేచి ఉండలేనంటూ’ ట్వీట్
-
Politics News
Panchumarthi Anuradha: అప్పుడు 26ఏళ్లకే మేయర్.. ఇప్పుడు తెదేపా ఎమ్మెల్సీ!
-
Movies News
Srikanth: విడాకుల రూమర్స్.. భార్యతో కలిసి వెళ్లాల్సి వస్తోంది: శ్రీకాంత్
-
Politics News
MLC Elections: వైకాపా పతనం ప్రారంభమైంది: తెదేపా శ్రేణులు