Rithu: నాన్నా ఒక్కసారి తిరిగిరావా.. కన్నీరు పెట్టిస్తోన్న జబర్దస్త్ నటి పోస్ట్
జబర్దస్త్ (Jabardasth) కామెడీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటి రీతూ చౌదరి(Rithu Chowdhary) ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి గుండెపోటుతో కన్నుమూశారు.
హైదరాబాద్: జబర్దస్త్(Jabardasth) కామెడీ షో ద్వారా అందరికీ దగ్గరైంది రీతూ చౌదరి(Rithu Chowdhary). తన టాలెంట్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రీతు ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తనకు నాన్న అంటే ఎంత ఇష్టమో సందర్భం వచ్చినప్పుడల్లా ఆమె చెబుతుంటుంది. తాజాగా తండ్రి మరణంపై సోషల్‌మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘ఐ మిస్ యూ నాన్న. నన్ను వదిలేసి ఎలా వెళ్లిపోయావు. నువ్వు లేకుండా నేను ఉండలేను. ఒక్కసారి నీ కూతురి దగ్గరికి తిరిగిరావా.. నాకు ఈ ఫొటో తీసుకున్నప్పుడు తెలియదు.. దీన్ని ఇలా పోస్ట్ చేయాల్సి వస్తుందని’’ అంటూ తన తండ్రితో దిగిన చివరి ఫొటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది.
ఈ విషయం తెలిసిన పలువురు నటులు, జబర్దస్త్ కమెడియన్లు విచారం వ్యక్తం చేశారు. ఆమెకు ధైర్యం చెబుతున్నారు. ఇక యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన రీతు సీరియల్స్‌లోనూ అలరిస్తోంది. ఎప్పుడూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను పలకరిస్తుంటుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.