Jai Bhim: సూర్య ‘జై భీమ్‌’కు మరో అరుదైన గౌరవం

మాస్‌ పాత్రల్లోనే కాదు, అప్పుడప్పుడు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తారు నటుడు సూర్య.

Published : 18 Jan 2022 12:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మాస్‌ పాత్రల్లోనే కాదు, అప్పుడప్పుడు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తారు నటుడు సూర్య. అలా ఆయన నటించి, నిర్మించిన చిత్రం ‘జై భీమ్‌’. తా.సే.జ్ఞానవేల్‌ దర్శకుడు. గతేడాది నవంబరులో ఓటీటీలో విడుదలైన ఈ సినిమా విమర్శకులను సైతం మెప్పించింది.

వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఓ కోర్టు డ్రామా కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. కాగా, ఇప్పుడు ఈ సినిమా ఓ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. అకాడమీ(ఆస్కార్‌) అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌లో ఈ సినిమాకు సంబంధించిన వీడియోను ఉంచారు. అకాడమీ యూట్యూబ్‌ వేదికగా ఒక తమిళ సినిమాకు సంబంధించిన వీడియోను ఉంచటం ఇదే తొలిసారి. దీంతో చిత్ర బృందంతో పాటు, సూర్య అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘జై భీమ్‌’ ఇండియన్‌ సినిమా స్థాయి మరో మెట్టు ఎక్కించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జస్టిస్‌ చంద్రు జీవితకథ ఆధారంగా ‘జై భీమ్‌’ను తెరకెక్కించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని