Rajinikanth: రజనీ చిత్రం... ‘హుకుం’?

‘జైలర్‌’కి కొనసాగింపుగా రూపొందనున్న సినిమాకి ‘హుకుం’ అనే పేరుని పరిశీలిస్తున్నారా? అవుననే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు.

Updated : 13 Apr 2024 11:49 IST

‘జైలర్‌’కి కొనసాగింపుగా రూపొందనున్న సినిమాకి ‘హుకుం’ అనే పేరుని పరిశీలిస్తున్నారా? అవుననే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. టైగర్‌ కా హుకుం... అంటూ ‘జైలర్‌’ సినిమాలో రజనీకాంత్‌ చేసిన సందడి  అభిమానుల్ని ఎంతగానో అలరించింది. మాస్‌ని ఆకట్టుకునేలా ఉన్న ‘హుకుం’ అనే మాటనే కొనసాగింపు చిత్రానికి పేరుగా ఖరారు చేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్టు సమాచారం. ‘జైలర్‌2’ అనే పేరు కూడా ప్రాచుర్యంలో ఉంది. నెల్సన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్‌’ సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దాంతో వెంటనే కొనసాగింపు చిత్రం కోసం రంగంలోకి దిగారు నెల్సన్‌. స్క్రిప్టు దాదాపుగా పూర్తయినట్టు సమాచారం. ఈ ఏడాదిలోనే సినిమా పట్టాలెక్కనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని