Janhvi kapoor: అంబానీ చిన్న కోడలి కోసం జాన్వీకపూర్‌ స్పెషల్‌ పార్టీ.. ఫొటోలు వైరల్‌

ముకేశ్‌ అంబానీకి కాబోయే కోడలు రాధిక కోసం నటి జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) స్పెషల్ పార్టీ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను తాజాగా ఆమె ఇన్‌స్టాలో షేర్ చేశారు.

Published : 15 Apr 2024 13:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ (Anant Ambani), ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌ సీఈఓ వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధిక (Radhika Merchant) వివాహం జులైలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాధిక కోసం జాన్వీకపూర్‌ తాజాగా స్పెషల్‌ పార్టీ నిర్వహించారు. స్నేహితులతో కలిసి బ్యాచులరేట్‌ పార్టీ ఏర్పాటు చేశారు. తెల్లని దుస్తుల్లో రాధిక మెరవగా.. మిగిలిన వారందరూ గులాబీ రంగు దుస్తుల్లో సందడి చేశారు.

వివిధ రకాల గేమ్స్, విందుతో పార్టీ సరదాగా సాగింది. కాబోయే వరుడు అనంత్‌, అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా, కుమార్తె ఇషా, జాన్వీ స్నేహితుడు శిఖర్‌ పహరియాతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకల్లో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను జాన్వీ తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. తమకెంతో ప్రత్యేకమైన పెళ్లి కుమార్తె కోసం పార్టీ నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు.

ఈ ఏడాది జులై 12న రాధిక - అనంత్‌ వివాహం జరగనుంది. ఫిబ్రవరిలో ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ జరిగాయి. జామ్‌నగర్‌ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో సినీ తారలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మెటా అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌, ఆయన సతీమణి ప్రిసిల్లా చాన్‌, క్రికెటర్లు సచిన్‌, ధోనీ.. సినీ తారలు రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె, రాణీ ముఖర్జీ, షారుక్‌ఖాన్‌ కుటుంబం, అర్జున్‌ కపూర్‌, ఆలియాభట్‌-రణబీర్‌ కపూర్‌ కుటుంబం, దర్శకుడు అట్లీ తదితరులు సందడి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని