Janhvi kapoor: మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన జాన్వీకపూర్‌

నటి జాన్వీకపూర్‌ (Janhvi kapoor) తనలోని దైవభక్తిని రుజువు చేసుకున్నారు.

Updated : 21 Mar 2024 13:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్‌ యువనటి జాన్వీకపూర్‌ (Janhvi Kapoor)కు దైవభక్తి మెండు. తరచూ ఆమె తిరుమల సందర్శిస్తుంటారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని మార్చి 6న స్నేహితులు శిఖర్‌ పహారియా, ఒరీతో కలిసి తిరుమల స్వామి సేవలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఒరీ తాజాగా నెటిజన్లతో పంచుకున్నారు. తిరుమల టూర్‌ ఎలా జరిగిందో అందులో తెలియజేశారు.

చెన్నైలోని జాన్వీ నివాసం నుంచి కారులో మూడు గంటలు ప్రయాణించి తిరుపతి చేరుకున్నామన్నారు. అనంతరం జాన్వీ బంధువులతో కలిసి నడక దారిన తిరుమల చేరుకున్నామని తెలిపారు. ఈ క్రమంలో మోకాళ్ల మిట్ట వద్ద జాన్వీ - శిఖర్‌ మోకాళ్లపై మెట్లెక్కారు. దాదాపు 50సార్లు తాను ఇక్కడికి వచ్చానని.. ఈ దేవాలయమంటే తనకెంతో ఇష్టమని ఆమె చెప్పారు.

రామ్‌చరణ్‌ నివాసంలో జాన్వీ సందడి:

రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. బుధవారం ఈ సినిమా అట్టహాసంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమం అనంతరం జాన్వీకపూర్‌, ఆమె తండ్రి బోనీ కపూర్‌, ఇతర చిత్రబృందం రామ్‌చరణ్‌ నివాసంలో సందడి చేశారు. చరణ్‌తో సరదాగా మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫొటోలను జాన్వీ ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని