Janhvi Kapoor: 15ఏళ్ల వయసులోనే నా మార్ఫింగ్‌ ఫొటోలను చూశా.. అందుకే ఆ విషయాన్ని చెప్పలేదు

Janhvi Kapoor: డీప్‌ఫేక్‌ వీడియోలు, ఫొటోల విషయంలో తనకు ఎదురైన అనుభవాల గురించి కథానాయిక జాన్వీకపూర్‌ చెప్పుకొచ్చింది.

Updated : 04 Jan 2024 18:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో క్రేజ్‌ ఉన్న హీరోయిన్లలో జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) ఒకరు. శ్రీదేవి తనయగా ఇండస్ట్రీకి పరిచయమైనా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల కాలంలో అందరినీ భయపెడుతున్న అంశం ‘డీప్‌ ఫేక్‌’. రష్మిక ఫేక్‌ వీడియో వైరల్‌ అయిన తర్వాత దీని గురించి చాలా మందికి తెలిసింది. అయితే, 15 ఏళ్ల వయసులోనే తనకు సంబంధించిన మార్ఫింగ్‌ ఫొటోలు, వీడియోలను చూశానని జాన్వీ కపూర్‌ వెల్లడించింది.

డీప్‌ ఫేక్‌ వీడియో బయటకు వచ్చిన వేళ రష్మిక ధైర్యంగా తన గళాన్ని వినిపించారని జాన్వీ ప్రశంసించింది. ‘‘ఇలా చెప్పడం వింతగా అనిపిస్తోంది. ఎందుకంటే నేను ఏది చెప్పినా, ఏం మాట్లాడినా ప్రతి ఒక్కరూ నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ మూలాల గురించి మాట్లాడతారు. అందుకే నేనెప్పుడూ అప్రమత్తంగానే ఉండేదాన్ని. నాకేం కావాలో, ఏం వద్దో ఎప్పుడూ బహిరంగంగా నా అభిప్రాయాలను వెల్లడించలేదు. డీప్‌ ఫేకర్స్‌, ఫొటోలను మార్ఫింగ్‌ చేసేవారి గురించి మాట్లాడానికి కూడా నాకు హక్కులేదు. ఈ విషయంలో నేనేమీ చెప్పలేను. కానీ, అలాంటి వారిని ఎదిరిస్తూ రష్మిక నిలబడిన తీరును మాత్రం ప్రశంసిస్తా. యుక్తవయసులోనే నా మార్ఫింగ్‌ ఫొటోలు, వీడియోలను చూశా. ఈ విషయాన్ని బయటకు చెప్పకూడదేమో అనుకున్నా. ఎందుకంటే ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి నేను అలా చేస్తున్నానని అనుకుంటారేమోనని భయపడ్డా’’ అని జాన్వీ కపూర్‌ వెల్లడించింది.

ప్రస్తుతం జాన్వీ తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. ఎన్టీఆర్‌ (NTR) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’(Devara) లో కథానాయికగా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్‌ ప్రతినాయకుడు. దీంతో పాటు, మిస్టర్‌ అండ్‌ మిస్సెస్‌ మహిలోనూ జాన్వీ నటించింది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని