janhvi kapoor: రామ్‌చరణ్‌ సరసన జాన్వీ

ఎప్పట్నుంచో ఊరిస్తున్న కలయిక... రామ్‌చరణ్‌ - జాన్వీకపూర్‌. త్వరలోనే కెమెరా ముందుకు అడుగు పెట్టనుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌చరణ్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

Updated : 07 Mar 2024 09:38 IST

ప్పట్నుంచో ఊరిస్తున్న కలయిక... రామ్‌చరణ్‌ - జాన్వీకపూర్‌. త్వరలోనే కెమెరా ముందుకు అడుగు పెట్టనుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌చరణ్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సమర్పిస్తున్నాయి. ఇందులో చరణ్‌ సరసన జాన్వీ కథానాయికగా నటిస్తుందనే సంగతి ఎప్పట్నుంచో వినిపిస్తోంది. ఇప్పుడు అదే నిజమైంది. జాన్వీకపూర్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం బుధవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. పాన్‌ ఇండియా స్థాయిలో, ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందనుంది. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.


దేవర తంగం

జాన్వీకపూర్‌ పుట్టినరోజు సందర్భంగా ‘దేవర’ బృందం ఈ పోస్టర్‌ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’. ఇందులో తంగం అనే పాత్రలో జాన్వీకపూర్‌ నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు