Janhvi Kapoor: ‘ఉలఝ్‌’ విడుదలకు సిద్ధం

కథల ఎంపికలో తన ప్రత్యేకతను చూపిస్తూ.. వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది బాలీవుడ్‌ యువకథానాయిక జాన్వీకపూర్‌. త్వరలో ఆమె ‘దేవర’తో తెరపై సందడి చేయడానికి ముస్తాబవుతుంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఉలఝ్‌’.

Updated : 14 Apr 2024 13:13 IST

థల ఎంపికలో తన ప్రత్యేకతను చూపిస్తూ.. వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది బాలీవుడ్‌ యువకథానాయిక జాన్వీకపూర్‌. త్వరలో ఆమె ‘దేవర’తో తెరపై సందడి చేయడానికి ముస్తాబవుతుంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఉలఝ్‌’. సుధాంశు సరియా దీన్ని తెరకెక్కిస్తున్నారు. గుల్షన్‌ దేవయ్య, రాజేశ్‌ థైలాంగ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను జులైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘ఇటీవలే చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్‌-ప్రొడక్షన్‌ పనులు ముగింపు దశలో ఉన్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఏడాది జులై 5న దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించింది చిత్రబృందం. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నార’’ని సన్నిహిత వర్గాలు తెలిపాయి. పొలిటికల్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జంగ్లీ పిక్చర్స్‌ నిర్మిస్తుంది. ఇందులో యువ ఐఎఫ్‌ఎస్‌ (ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసెస్‌) అధికారిణిగా కనిపించనుంది జాన్వీ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు