Janhvi Kapoor: ఎన్టీఆర్‌తో సినిమా.. ప్రతిరోజూ దేవుడిని ప్రార్థించా: జాన్వీకపూర్‌

ఎన్టీఆర్‌ (NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) కథానాయిక. ఈ సినిమాలో అవకాశం రావడంపై తాజాగా ఆమె స్పందించారు.

Published : 19 Mar 2023 14:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎన్టీఆర్‌ (NTR)ని తాను ఎంతగానో అభిమానిస్తున్నట్లు చెప్పారు నటి జాన్వీకపూర్‌ (Janhvi Kapoor). ఆయనతో పనిచేసే అవకాశం రావడం పట్ల ఆమె తాజాగా స్పందించారు. ‘‘ఎన్టీఆర్‌ అంటే నాకెంతో ఇష్టం. ఆయనతో పనిచేసే ఛాన్స్‌ వస్తే బాగుండని ఇప్పటికే ఎన్నోసార్లు ఇంటర్వ్యూల్లో చెప్పాను. ప్రతిరోజూ దేవుడిని కోరుకునేదాన్ని. ఫైనల్‌గా అది నిజమైంది. సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నా. సెట్‌లోకి అడుగుపెట్టేందుకు దర్శకుడికి రోజూ మెసేజ్‌లు పెడుతున్నా. ఇటీవలే మరోసారి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చూశాను. ఆయన అందం, ఉత్సాహం.. మరోస్థాయిలో ఉంటాయి’’ అని జాన్వీ తెలిపారు.

అనంతరం ఆమె (Janhvi Kapoor) తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘సినీ పరిశ్రమకు చెందిన కుటుంబంలో పుట్టినందుకు ఆనందిస్తున్నా. కెరీర్‌ ఆరంభంలోనే నేను ఇంతటి గుర్తింపు పొందుతున్నానంటే దానికి కారణం నా తల్లిదండ్రులే. అయితే, నేను ధరించే దుస్తులను కాకుండా నా వర్క్‌ని అందరూ గుర్తించాలని.. దాని గురించే మాట్లాడుకోవాలని ఆశిస్తున్నాను. అలాగే పబ్లిక్‌ లైఫ్‌లో ఉన్నందున విషయం ఏదైనా ప్రతి ఒక్కరూ మనల్ని వేలెత్తి చూపించేందుకు చూస్తారు. గట్టిగా నవ్వితే తప్పంటారు. ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోతే పొగరంటారు. కాబట్టి అభిప్రాయాలనేవి ఎప్పటికీ ఒకేలా ఉండవు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్లడమే’’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని