Janhvi Kapoor: ఆ షూటింగ్‌లో రెండు భుజాలకు ఎన్నో గాయాలయ్యాయి: జాన్వీ కపూర్‌

‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ షూటింగ్‌ అనుభవాలను జాన్వీ కపూర్‌ పంచుకున్నారు.

Published : 15 May 2024 18:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు హీరోయిన్ జాన్వీకపూర్‌ (Janhvi Kapoor). ఈ చిత్రం షూటింగ్‌ విశేషాలను తాజాగా పంచుకున్నారు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడినట్లు చెప్పారు.

‘ఈ చిత్రం కోసం ‘మిలీ’ సినిమా షూటింగ్‌ సమయంలోనే శిక్షణ ప్రారంభించాను. పూర్తిగా నేర్చుకోవడానికి రెండేళ్లు పట్టింది. నా కోచ్‌లు నన్ను పూర్తి క్రికెటర్‌గా మార్చారు. నిజానికి వీఎఫ్‌ఎక్స్‌తో దర్శకుడు అనుకున్న సన్నివేశాలను చిత్రీకరించొచ్చు. కానీ, ఆయన ప్రతీ సీన్‌ సహజంగా ఉండాలని కోరుకున్నారు. అందుకే అలా చేయలేదు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నాకు ఎన్నో గాయాలయ్యాయి. రెండు భుజాలు పనిచెయ్యవేమో అనుకున్నా. నా ఇద్దరు కోచ్‌లు క్రికెట్‌ నేర్పడం కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ చిత్రం విడుదలయ్యాక నా పాత్రకు వచ్చే ప్రశంసలన్నీ వాళ్లకే దక్కుతాయి. ఎన్నోసార్లు ఈ సినిమా నుంచి వైదొలగాలని భావించా. వాళ్లు నాకు ధైర్యం చెప్పారు’ అని జాన్వీ వెల్లడించారు.

తప్పుడు వార్తలపై మెహరీన్‌ అసహనం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్‌

దర్శకుడు శరణ్‌శర్మ ఇటీవల జాన్వీ క్రికెట్‌ నేర్చుకుంటున్న ఫొటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ సినిమాకు ముందు జాన్వీకు క్రికెట్‌ గురించి ఏమీ తెలియదనీ.. ఇప్పుడు అన్నీ నేర్చుకుందని వెల్లడించారు. ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ విషయానికొస్తే..  క్రికెట్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో మహేంద్ర పాత్రలో రాజ్‌కుమార్‌, మహిమ పాత్రలో జాన్వీ కనిపించనున్నారు. అపూర్వ మోహతా, కరణ్‌జోహార్‌ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే31న ప్రేక్షకుల ముందుకురానుంది. 

ప్రస్తుతం జాన్వీ తెలుగులోనూ బిజీగా మారారు. ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘దేవర’లో నటిస్తున్నారు. ఇందులో ఆమె తంగం అనే పాత్రలో పక్కా పల్లెటూరి అమ్మాయిగా కనిపించనున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో... రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకురానుంది. తొలి భాగాన్ని అక్టోబర్‌ 10న విడుదల చేయనున్నారు. దీనితో పాటు రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రానున్న చిత్రంతోనూ జాన్వీ అలరించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని