janhvi kapoor: అన్నీ తానై చూసుకుంటుంది

‘ఖుషి నాకంటే చిన్నదే అయినప్పటికీ అమ్మలా ప్రేమగా చూసుకుంటుంది. అప్పుడప్పుడు అక్కలా వ్యవహరిస్తోంది’ అని చెప్తోంది బాలీవుడ్‌ కథానాయిక జాన్వీ కపూర్‌.

Updated : 07 Jan 2024 09:28 IST

ఖుషి నాకంటే చిన్నదే అయినప్పటికీ అమ్మలా ప్రేమగా చూసుకుంటుంది. అప్పుడప్పుడు అక్కలా వ్యవహరిస్తోంది’ అని చెప్తోంది బాలీవుడ్‌ కథానాయిక జాన్వీ కపూర్‌. ‘దేవర’తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనుందీ భామ. ‘ఉలఝ్‌’, ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహీ’ లాంటి సినిమాలతో హిందీలోనూ బిజీగా గడుపుతోందీమె. ఇటీవల ఓ రియాలిటీ షోలో పాల్గొన్న ఈమె మాట్లాడుతూ...‘మానసికంగా సన్నద్ధమై నేను చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టా. ఆ సమయంలో నేను హైపర్‌ సెన్స్‌టీవ్‌. కానీ, ఇప్పుడలా కాదు చాలా మారిపోయాను’ అని అంది. ‘ఖుషి నాకన్న వయసులో చిన్నదే అయినప్పటికీ అమ్మలా ప్రేమను పంచుతుంది. కొన్ని సమయాల్లో నాకే అక్కలా వ్యవహరిస్తోంది. అప్పుడప్పుడు నేను కూడా అలానే భావిస్తాను. నా కూతురులా తనని చూసుకుంటాను’ అంటూ తన సోదరి ఖుషీ కపూర్‌ గురించి తెలిపింది. గతేడాది డిసెంబరులో విడుదలైన ‘ది ఆర్చీస్‌’తో ఖుషి సినీరంగంలో అడుగుపెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని