Janhvi Kapoor: సూర్యకు జోడీగా జాన్వీకపూర్‌..?

నటి జాన్వీకపూర్‌ ఓ క్రేజీ ఆఫర్‌ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సూర్య సరసన ఆమె కథానాయికగా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Updated : 28 Jan 2024 18:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ దర్శకుడు రాకేశ్‌ ఓంప్రకాశ్‌ మిశ్రా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించనున్న ప్రాజెక్ట్‌ ‘కర్ణ’ (Karna). మహాభారతంలోని కర్ణుడి పాత్రను ఆధారంగా చేసుకుని దీనిని తీర్చిదిద్దనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సూర్య (Suriya) హీరోగా నటించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్‌గా మారింది. శ్రీదేవి కుమార్తె, నటి జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) ఇందులో కథానాయికగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిత్రబృందం ఇప్పటికే ఆమెను సంప్రదించారని బాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై చిత్రబృందం నుంచి కానీ, నటి టీమ్‌ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. రెండు భాగాల్లో విడుదల కానుంది. ఫర్హాన్‌ అక్తర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు షాహిద్‌కపూర్‌తో ఈ ప్రాజెక్ట్‌ చేయాలని రాకేశ్‌ భావించారు. అనుకోని కారణాలతో వైదొలగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని