JanhviKapoor: తంగం కోసం జాన్వీ ఎదురుచూపు

‘దేవర’లో ఎన్టీఆర్‌కి జోడీగా తంగం పాత్రలో అలరించడానికి సిద్ధమవుతోంది బాలీవుడ్‌ నాయిక జాన్వీ కపూర్‌. దీన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతోంది

Updated : 27 Mar 2024 11:34 IST

‘దేవర’లో ఎన్టీఆర్‌కి జోడీగా తంగం పాత్రలో అలరించడానికి సిద్ధమవుతోంది బాలీవుడ్‌ నాయిక జాన్వీ కపూర్‌. దీన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతోంది. మరోవైపు రామ్‌చరణ్‌ 16వ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైన జాన్వీ ముహూర్తపు సన్నివేశాల కోసం హైదరాబాద్‌ వచ్చేసింది. అనంతరం గోవా తిరిగి వెళ్లడానికి ఉత్సాహం చూపిస్తూ... ‘‘దేవర’లో మళ్లీ తంగం పాత్ర చిత్రీకరణ కోసం ఇక ఏమాత్రం వేచి ఉండలేకపోతున్నాను’ అంటూ మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఈ చిత్రం పట్ల జాన్వీ ఎంతో ఉత్సుకతతో ఉన్నట్లు తెలుస్తోందని చాలామంది అభిమానులు స్పందించారు. అక్టోబరు 10న విడుదలయ్యే ఈ సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా కనిపిస్తుండగా.. షైన్‌ టామ్‌ ఛాకో, శ్రీకాంత్‌, ప్రకాశ్‌రాజ్‌, మీరా జాస్మిన్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.a

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని