Jani Master: మాపై బురద జల్లే ప్రయత్నమిది: రేవ్‌పార్టీ రూమర్స్‌పై జానీ మాస్టర్‌

రేవ్‌ పార్టీ విషయంలో తనపై వచ్చిన రూమార్స్‌పై జానీ మాస్టర్‌ స్పందించారు.

Updated : 20 May 2024 19:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బెంగళూరు శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీలో తాను పాల్గొన్నట్టు వచ్చిన వార్తలను కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ (Jani Master) ఖండించారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. జానీ మాస్టర్‌ పార్టీకి హాజరైనట్టు కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ పెట్టగా.. సంబంధిత స్క్రీన్‌షాట్లను షేర్‌ చేస్తూ తనకు అలాంటి అలవాట్లు లేవని ఆయన స్పష్టం చేశారు. ‘‘నాకు అలాంటి అలవాట్లు లేవని నా గురించి తెలిసిన వారందరికీ తెలుసు. అనవసరంగా నాపై, మా జనసేనానిపై బురద జల్లే ప్రయత్నమిది. ఇలా తప్పుడు ప్రచారం చేసే వారి ఏడుపు త్వరలోనే వింటాం. నిజం తెలుసుకోకుండా రూమర్స్‌ నమ్మేసి, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న, పోస్ట్‌లు పెడుడుతున్న వారి మానసిక స్థితి చూస్తుంటే జాలేస్తుంది’’ అని పేర్కొన్నారు. జానీ మాస్టర్‌ జనసేన నేత అన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఆయన స్టార్‌ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు.

బెంగళూరులో 100 మందితో రేవ్‌పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!

బెంగళూరు శివారులో ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన రేవ్‌ పార్టీలో పలువురు నటీనటులు, మోడళ్లు పట్టుబడ్డారు. దాదాపు 100 మందికి పైగా పార్టీకి హాజరయ్యారు. పార్టీలో పలు రకాల డ్రగ్స్‌ వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ పార్టీలో టాలీవుడ్‌ నటుడు శ్రీకాంత్‌, హేమ సైతం పాల్గొన్నారంటూ ప్రచారం జరగ్గా వారు కూడా స్పందించారు. తమకెలాంటి సంబంధం లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని