Game Changer: ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్‌లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్‌చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్‌చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది.
‘సిక్స్ ప్యాక్‌లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్‌చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్‌చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ‘గేమ్ ఛేంజర్’లోని ‘జరగండి జరగండి...’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. తమన్ స్వరకల్పనలోని ఈ పాటని, అనంతశ్రీరామ్ రచించారు. దలేర్ మెహందీ, సునిధి చౌహాన్ ఆలపించారు. శంకర్ మార్క్ భారీహంగులతో ఈ పాటని తెరకెక్కించినట్టు లిరికల్ వీడియో స్పష్టం చేసింది. రామ్‌చరణ్ యువ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్, అంజలి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: తిరుణ్ణావుక్కరసు, యాక్షన్: అన్బరివు, కథ: కార్తీక్ సుబ్బరాజు, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, కళ: అవినాష్ కొల్లా, రామకృష్ణ, మోనిక.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్‌తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్‌కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్‌స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు