Spy: గుండెల్లో మో·గే.. నీ తొలి కబురే

‘స్పై’గా థ్రిల్‌ పంచేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు నిఖిల్‌. ఆయన.. ఐశ్వర్య మేనన్‌ జంటగా నటించిన ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని గ్యారీ బీహెచ్‌ తెరకెక్కించారు.

Updated : 12 Jun 2023 13:00 IST

‘స్పై’ (SPY)గా థ్రిల్‌ పంచేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు నిఖిల్‌ (Nikhil). ఆయన.. ఐశ్వర్య మేనన్‌ (Iswarya Menon) జంటగా నటించిన ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని గ్యారీ బీహెచ్‌ తెరకెక్కించారు. కె.రాజశేఖర్‌ రెడ్డి నిర్మాత. ఆర్యన్‌రాజేష్‌, సన్యా ఠాకూర్‌, అభినవ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని వేగవంతం చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా ఆదివారం ఈ చిత్ర తొలి గీతాన్ని విడుదల చేశారు. ‘‘మొదటిసారిగా చూపు తగిలే.. గుండెల్లో మోగిందే నీ తొలి కబురే’’ అంటూ సాగుతున్న ఈ పాటకు విశాల్‌ చంద్రశేఖర్‌ స్వరాలు సమకూర్చగా.. కిట్టు విస్సప్రగడ సాహిత్యమందించారు. అనురాగ్‌ కులకర్ణి, రమ్య బెహరా సంయుక్తంగా ఆలపించారు. పాటలో నిఖిల్‌, ఐశ్వర్యల కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది. ‘‘సుభాష్‌ చంద్రబోస్‌ మరణం వెనకున్న రహస్యం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుంది’’ అని చిత్రవర్గాలు తెలిపాయి. సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, విశాల్‌ చంద్రశేఖర్‌, ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు, మార్క్‌ డేవిడ్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని