Joram on OTT: ఓటీటీలోకి వచ్చేసిన అవార్డ్‌ విన్నింగ్‌ పిక్చర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Joram on OTT: మనోజ్‌ బాజ్‌పాయ్‌ కీలక పాత్రలో నటించిన ‘జొరామ్‌’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Published : 02 Feb 2024 19:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన విలక్షణ పాత్రలు, నటనతో అలరిస్తుంటారు బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ (Manoj Bajpayee). దేవాశిష్‌ మకీజా దర్శకత్వంలో ఆయన నటించిన సర్వైవల్‌ థ్రిల్లర్‌ ‘జొరామ్‌’ (Joram). డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ మూవీ విమర్శకులను మెప్పించింది. అంతేకాదు, వివిధ అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లోనూ ప్రత్యేకంగా ప్రదర్శించే అవకాశాన్ని దక్కించుకుంది.

ఇటీవల ప్రకటించిన ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లోనూ మెరిసింది. ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌), ఉత్తమ కథ అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి ‘జొరామ్‌’ రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ వేదికగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. అయితే, ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన ఈ మూవీని అందుబాటులోకి తెచ్చారు. రూ.199 చెల్లించి చూడొచ్చు.

ఇంతకీ జొరామ్‌ కథేంటంటే: ఝార్ఖండ్‌లో ఓ గిరిజన ప్రాంతానికి చెందిన దాస్రు (మనోజ్‌ బాజ్‌పాయ్‌) వాన్నో (తనిష్ట ఛటర్జీ)లు సొంత గ్రామాన్ని వీడి కూలి పని కోసం ముంబయి వెళ్తారు.  అనుకోని పరిస్థితుల్లో దాస్రు జీవితంలో గిరిజన రాజకీయ నాయకుడు ఫులో కర్మ (స్మిత తాంబే) వస్తాడు. దాస్రు, అతడి కుటుంబాన్ని చంపేందుకు యత్నిస్తాడు. ఇంతకీ దాస్రు, ఫులో మధ్య గతంలో ఏం జరిగింది?ఫులో నుంచి దాస్రు ఎలా తప్పించుకున్నాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది మిగిలిన కథ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని