Jr NTR: ఎన్టీఆర్‌-ధనుష్‌-వెట్రిమారన్‌ మూవీ నిజమేనా? తారక్‌ టీమ్‌ ఏం చెప్పిందంటే?

ఎన్టీఆర్‌, ధనుష్‌, వెట్రిమారన్‌ కాంబినేషన్‌లో మూవీపై సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలపై తారక్‌ టీమ్‌ స్పందించింది.

Published : 08 Mar 2023 18:57 IST

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ (NTR), ధనుష్‌ (dhanush) కథానాయకులుగా తమిళ దర్శకుడు వెట్రిమారన్‌ ఓ పాన్‌ ఇండియా మూవీని చేస్తున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా సోషల్‌మీడియాలో ఈ వార్త విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. అధికారికంగా ప్రకటించడమే తరువాయి అంటూ పలు వెబ్‌సైట్‌లు సైతం రాసుకొచ్చాయి. ఈ క్రమంలో తాజా వార్తలపై ఎన్టీఆర్‌ టీమ్‌ స్పందించింది. అవన్నీ ఆధారాల్లేని వార్తలని, అవాస్తవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేశారు.

‘‘ఎన్టీఆర్‌, ధనుష్‌, వెట్రిమారన్‌లు కలిసి సినిమా చేస్తున్నారని, గత రెండు, మూడు రోజులుగా కొన్ని అనధికార వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆ వార్తలన్నీ అవాస్తవం. దయచేసి ఆ ఊహాగానాలను నమ్మొద్దు’’ అని పేర్కొంది. ఇక ఈ సినిమా పాన్‌ ఇండియా మూవీ అని, రెండు భాగాలుగా వస్తుందని కూడా కొందరు రాసుకొచ్చారు.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. జాన్వీకపూర్ కథానాయిక. ‘NTR30’ వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాతోనే జాన్వీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ఆస్కార్‌ అవార్డుల వేడుకలో పాల్గొనేందుకు లాస్‌ ఏంజిల్స్ వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొరటాల మూవీ షూటింగ్‌ పాల్గొంటారు. దీని తర్వాత ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో ఓ మూవీని చేస్తారు. పాన్‌ ఇండియా మూవీగా ఇది తెరకెక్కనుంది. మరోవైపు విజయ్‌సేతుపతితో వెట్రిమారన్‌ ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత సూర్యతో ‘వాడివసల్‌’ చేస్తారు. ఇక ధనుష్‌ ఇటీవల ‘సార్‌’తో మంచి విజయాన్ని అందుకోగా, ప్రస్తుతం అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో ‘కెప్టెన్‌ మిల్లర్‌’ మూవీ చేస్తుండగా, దీని తర్వాత శేఖర్‌ కమ్ములతో ఓ సినిమా చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని