Jyothika: సూర్య విషయంలో.. అందుకు గర్వపడతా: జ్యోతిక

సినిమాలకు సంబంధించి తన భర్త సూర్య విషయంలో గర్వపడతానని నటి జ్యోతిక అన్నారు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆయన్ను ప్రశంసించారు.

Published : 24 Mar 2024 17:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన భర్త, ప్రముఖ నటుడు సూర్య (Suriya)పై నటి జ్యోతిక (Jyothika) ప్రశంసలు కురిపించారు. మహిళా పాత్రలకు ప్రాధాన్యం ఉండే స్క్రిప్టులను ఆయన ఎక్కువగా ఎంపిక చేసుకుంటారని, అందుకు తానెప్పుడూ గర్వపడతానని అన్నారు. తన కొత్త సినిమా ‘షైతాన్‌’ (Shaitaan) ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సూర్య గురించి మాట్లాడారు. ‘‘సూర్య సినిమాల్లో ఏ మహిళా పాత్ర కించపరిచేలా ఉండదు. ఫిమేల్‌ క్యారెక్టర్లు ఉన్నతంగా ఉండేలా చూసుకుంటారు. స్టోరీ డిమాండ్‌ చేస్తే తన పాత్ర కన్నా విమెన్‌ రోల్‌కు నిడివి ఎక్కువ ఉన్నా ఆయన పట్టించుకోరు. ఇందుకు ‘జై భీమ్‌’ సినిమా ఓ ఉదాహరణ’’ అని పేర్కొన్నారు.

‘షైతాన్‌’తో రెండు దశాబ్దాల తర్వాత బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు జ్యోతిక. వికాస్‌ భల్‌ దర్శకత్వం వహించిన ఈ హారర్‌ ఫిల్మ్‌లో అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn), మాధవన్‌ (Madhavan) హీరోలుగా నటించారు. మార్చి 8న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. సూర్య ప్రస్తుతం ‘కంగువా’తో బిజీగా ఉన్నారు. శివ దర్శకుడు. దిశా పటానీ కథానాయికగా నటించగా బాబీ దేవోల్‌ కీలక పాత్ర పోషించారు. కంగ అనే ఓ పరాక్రముడి కథతో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని