Jyotika: ఇది సినిమా కాదు..స్నేహితులతో ప్రయాణం: జ్యోతిక

‘షైతాన్‌’  విజయం సందర్భంగా నటి జ్యోతిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టారు.

Published : 21 Mar 2024 13:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాది కథానాయిక జ్యోతిక (Jyotika) 25 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లో చేసిన సినిమా ‘షైతాన్‌’ (shaitaan). ఇందులో ఆమెతో పాటు అజయ్‌దేవగణ్‌ (Ajay Devgn),  ఆర్‌.మాధవన్‌ (R Madhavan) కీలక పాత్రల్లో నటించారు. వికాశ్‌ భల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 8న విడుదలై మంచి వసూళ్లు రాబడుతోంది.  బాక్సాఫీస్‌ వద్ద 150 కోట్ల మైలురాయిని అధిగమించిందని ట్రేడ్‌ వర్గాల సమాచారం. ఈ సినిమా విజయం సందర్భంగా నటి జ్యోతిక ఇన్‌స్టాగ్రామ్‌లో చిత్రబృందంతో ఉన్న వీడియో షేర్‌ చేస్తూ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ‘‘షైతాన్‌ అంచనాలు నిజం చేస్తూ విజయం సాధించింది. చిత్రబృందానికి అభినందనలు. కొన్ని సినిమాలు గమ్యస్థానాలు మాత్రమే. కానీ షైతాన్‌ జ్ఞాపకాలు, సృజనాత్మకత, ప్రతిభ ముఖ్యంగా చిరకాల స్నేహితులతో చేసిన ప్రయాణం. ఇంత గొప్ప చిత్రంలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది. నిర్మాణ సంస్థలు అజయ్‌దేవగణ్‌ ఫిల్మ్‌స్‌, పనోరమా స్టూడియోస్‌, జియో స్టూడియేస్‌కు కృతజ్ఞతలు’’ అని జ్యోతిక పేర్కొన్నారు.

కథేంటంటే: కబీర్‌(అజయ్‌ దేవగణ్‌) తన కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు ఫామ్‌హౌస్‌కు వెళ్తాడు. దారి మధ్యలో దాబా వద్ద వనరాజ్‌ (ఆర్‌. మాధవన్‌) పరిచయమవుతాడు. అయితే అదేరోజు రాత్రి కబీర్‌ ఫామ్‌హౌస్‌కు వచ్చి ఫోన్‌ ఛార్జింగ్‌ అయిపోయిందని ఛార్జర్‌ కావాలని అడుగుతాడు. అలా ఆ ఇంట్లోకి ప్రవేశించిన వనరాజ్‌, కబీర్‌ కుమార్తె జాన్వీ(జాంకీ)ని హిప్నటైజ్‌ చేస్తాడు. అప్పటి నుంచి వనరాజ్‌ ఏం చెబితే జాన్వీ అదే చేస్తుంది. ఈ వనరాజ్‌ ఎవరు? కబీర్‌ కుటుంబాన్ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడు? అతని బారిన పడిన జాన్వీని కాపాడటానికి కబీర్‌ కుటుంబం ఏం చేసింది?..తదితర అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని