Jyotika: సూర్యలో నాకు నచ్చిన విషయం అదే: జ్యోతిక

తన చిత్రాలకు వేరే హీరోలు అవసరం లేదని నటి జ్యోతిక అన్నారు. తానే మెయిన్‌ లీడ్‌లో నటిస్తున్నట్లు చెప్పారు.

Updated : 11 Apr 2024 19:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సెకండ్‌ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో అలరిస్తున్నారు నటి జ్యోతిక (Jyotika). చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్స్‌తో కలిసి నటించిన అతికొద్ది మంది నటీమణుల్లో ఆమె ఒకరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సహ నటులపై అభిప్రాయాన్ని పంచుకున్నారు. సూర్యలో నచ్చిన, నచ్చని విషయాలను చర్చించారు.

తమిళంలో ఏ హీరోతో నటించాలనుకుంటున్నారు అనే ప్రశ్నకు జ్యోతిక ఆసక్తికర సమాధానమిచ్చారు. ‘చాలా రోజుల నుంచి నా సినిమాల్లో మెయిన్‌ లీడ్‌ నేనే చేస్తున్నాను. అందుకే వేరే హీరో కావాలని అనుకోవడం లేదు. ఒకవేళ ఏదైనా మంచి కథ ఉంటే హిందీలో సూర్యతో కలిసి నటించేందుకు సిద్ధంగా ఉన్నాను. ఇప్పటివరకు చేసిన హీరోలంటే నాకెంతో గౌరవం. సినిమా బాగా రావడం కోసం మమ్ముట్టి ఎంత కష్టమైనా పడతారు. రజనీకాంత్‌ సూపర్‌ స్టార్‌డమ్‌ ఉన్న హీరో. విజయ్‌ స్థిరత్వం ఉన్న నటుడు’ అని ప్రశంసించారు.

సూర్య గురించి చెబుతూ.. ‘అతడు అందరినీ గౌరవిస్తాడు. అందరి కోసం సమయాన్ని కేటాయిస్తాడు. సూర్యలో ఈ విషయం నాకు చాలా నచ్చుతుంది. స్నేహానికి విలువిస్తాడు. సహనం ఎక్కువ. అవతలి వ్యక్తి మాట్లాడేది ఓపిగ్గా వింటాడు. ఇంట్లో నేను ఎక్కువ మాట్లాడుతుంటా.. సూర్య వింటూ ఉంటాడు. దేన్నైనా తట్టుకోగలడు. అతడిలో నచ్చని విషయానికొస్తే.. బాత్రూమ్‌లో ఎక్కువసేపు గడుపుతాడు. ప్రతిరోజు ఉదయం మా ఇద్దరికీ ఈ విషయంలో ఫైట్స్‌ జరుగుతుంటాయి’ అని జ్యోతిక సరదాగా చెప్పారు. ప్రస్తుతం ఆమె ‘షైతాన్‌’ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవ్‌గణ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ హారర్‌ థ్రిల్లర్‌కు వికాశ్‌భల్‌ దర్శకత్వం అందించారు. ఆర్‌.మాధవన్‌ నెగెటివ్‌ రోల్‌లో కనిపించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం థ్రిల్‌ను పంచుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు