Kaatera: ఓటీటీలోకి కన్నడ బ్లాక్‌బస్టర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

కన్నడ నటుడు దర్శన్‌ (Darshan) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కాటేరా’ (Kaatera)

Updated : 15 Apr 2024 11:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కన్నడ నటుడు దర్శన్‌ (Darshan) ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘కాటేరా’ (Kaatera). యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు తరుణ్‌ సుధీర్‌ దర్శకత్వం వహించారు. గతేడాది డిసెంబర్‌ 29న ఇది విడుదలైంది. కన్నడలో ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. దాదాపు రూ.100 కోట్లు వసూలు చేసినట్లు అంచనా. ఇప్పటికే ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతుంది. తాజాగా తెలుగు, తమిళ వెర్షన్‌ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ జీ5 సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టింది. ఈ మేరకు ఆదివారం నుంచి ‘కాటేరా’ తెలుగు, తమిళ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.

1970లో కర్ణాటకలోని ఓ గ్రామంలో జరిగిన వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని ‘కాటేరా’ చిత్రాన్ని తెరకెక్కించారు. మాలాశ్రీ కుమార్తె ఆరాధన రామ్‌ కథానాయికగా తెరంగేట్రం చేశారు. కాటేరాగా దర్శన్‌ యాక్టింగ్‌కు కన్నడ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కథ, కథనం చక్కగా కుదరడంతో ఇది విజయాన్ని అందుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని