Kajal Aggarwal: అవన్నీ ఒకెత్తు.. ‘సత్యభామ’ ఒకెత్తు.. హైదరాబాద్‌లోనే ఉంటున్నా: కాజల్‌

కాజల్‌ నటిస్తున్న నాయికా ప్రాధాన్య చిత్రం ‘సత్యభామ’. ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు విశేషాలు పంచుకున్నారు.

Published : 29 Nov 2023 12:05 IST

హైదరాబాద్‌: విజయశాంతిని స్ఫూర్తిగా తీసుకుని తన కొత్త చిత్రం ‘సత్యభామ’ (Satyabhama)లో నటిస్తున్నానని ప్రముఖ కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) తెలిపారు. ఈ సినిమాలో ఆమె పోలీసు అధికారిణిగా నటిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘మేజర్‌’ సినిమా నాకు బాగా నచ్చింది. చూసిన వెంటనే ఆ చిత్ర దర్శకుడు శశి కిరణ్‌తో కలిసి పనిచేయాలనుకున్నా. ఆయన దర్శకత్వంలో కాకపోయినా స్క్రీన్‌ప్లే అందిస్తూ సమర్పకులుగా వ్యవహరిస్తున్న ‘సత్యభామ’లో భాగమవడం సంతోషంగా ఉంది. ‘భగవంత్‌ కేసరి’ సినిమా షూటింగ్‌ నిమిత్తం హైదరాబాద్‌ వచ్చిన సమయంలో శశి కిరణ్‌ చెప్పిన కథ విని నేను ఆశ్చర్యపోయా. కచ్చితంగా ఈ సినిమాలో నటించాలని ఫిక్స్‌ అయిపోయి హైదరాబాద్‌కు వచ్చేశా. అప్పటి నుంచి కుటుంబంతో కలిసి ఇక్కడే ఉంటున్నా. బాబును చూసుకుంటూ షూటింగ్స్‌కు హాజరవుతున్నా. ‘సత్యభామ’ కోసం మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నా. విజయశాంతిని స్ఫూర్తిగా తీసుకుని యాక్షన్‌ సీక్వెన్స్‌లో నటిస్తున్నా. ఇంతకుముందు నేను నటించిన సినిమాలన్నీ ఒకెత్తు.. ఈ సత్యభామ ఒకెత్తు. చిత్రీకరణ దాదాపు 65 శాతం పూర్తయింది’’ అని కాజల్‌ వివరించారు.

జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన నటి ప్రగతి

ఈ చిత్రానికి సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. మరోవైపు, కాజల్‌ ‘భారతీయుడు 2’లోనూ నటిస్తున్నారు. కమల్‌ హాసన్‌ హీరోగా దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘భగవంత్‌ కేసరి’తో ఇటీవల ప్రేక్షకులను అలరించారు కాజల్‌. అందులో ఆమె కీలక పాత్ర పోషించారు. దసరా కానుకగా అక్టోబరు 19న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద హిట్‌గా నిలిచింది. ఇటీవల ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌’లో విడుదలై అక్కడా హవా కొనసాగిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని