‘కన్నప్ప’లో కాజల్‌

విష్ణు మంచు కలల చిత్రం ‘కన్నప్ప’కి మరో ఆకర్షణ తోడైంది. ప్రముఖ కథానాయిక కాజల్‌ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఆ విషయాన్ని చిత్రబృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్, శరత్‌ కుమార్‌ తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే.

Published : 18 May 2024 00:23 IST

విష్ణు మంచు కలల చిత్రం ‘కన్నప్ప’కి మరో ఆకర్షణ తోడైంది. ప్రముఖ కథానాయిక కాజల్‌ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఆ విషయాన్ని చిత్రబృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్, శరత్‌ కుమార్‌ తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే. భక్త కన్నప్ప జీవితం ఆధారంగా... ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది.  ఎక్కువగా న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో తెరకెక్కించారు. ఈ నెల 20న కేన్స్‌లో జరిగే ప్రతిష్ఠాత్మక చిత్రోత్సవాల్లో టీజర్‌ని విడుదల చేయనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు