Kajal Aggarwal: వస్తోంది.. సత్యభామ

కాజల్‌ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన ‘సత్యభామ’ జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 24 May 2024 01:28 IST

కాజల్‌ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన ‘సత్యభామ’ జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదట ఈ నెలలోనే విడుదల ఖరారు చేసుకున్న ఈ సినిమా  కొన్ని కారణాల వల్ల జూన్‌ 7కి వాయిదా పడింది. కాజల్‌ అగర్వాల్‌ పోలీసు అధికారిగా నటించిన చిత్రమిది. సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి నిర్మాతలు. దర్శకుడు  శశికిరణ్‌ తిక్క స్క్రీన్‌ప్లే సమకూర్చడంతోపాటు, సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందిన చిత్రమిది. మహిళా ప్రేక్షకులు తప్పకుండా  చూడాల్సిన సినిమా ఇదంటూ కాజల్‌ ప్రచార కార్యక్రమాల్లో చెబుతున్నారు. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణ విడుదల చేయనున్నారు. ప్రకాశ్‌రాజ్, నవీన్‌ చంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, ఛాయాగ్రహణం: బి.విష్ణు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని