Kajal Karthika ott: ఎట్టకేలకు ఓటీటీలో వస్తున్న కాజల్‌ హారర్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

కాజల్‌, రెజీనా కీలక పాత్రల్లో నటించిన ‘కార్తీక’ మూవీ తెలుగులో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.

Updated : 02 Apr 2024 13:35 IST

హైదరాబాద్‌: కాజల్‌, రెజీనా ప్రధాన పాత్రల్లో కార్తికేయన్‌ (డీకే) తెరకెక్కించిన తమిళ చిత్రం ‘కరుంగాపియం’. ‘కార్తీక’ పేరుతో గతేడాది జులైలో తెలుగు ప్రేక్షకుల ముందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా తమిళంలో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహా(Aha)లో ఏప్రిల్‌ 9వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. 

కథేంటంటే: కార్తీక (రెజీనా).. కాలక్షేపం కోసం ఓ పాత లైబ్రరీకి వెళ్తుంది. అక్కడ ఆమెకు వందేళ్ల క్రితం రాసిన ‘కాటుక బొట్టు’ అనే పుస్తకం కనిపిస్తుంది. పురాతన గ్రంథంలా కనిపించిన ఆ పుస్తకాన్ని చూసిన వెంటనే ఆమెకు చదవాలనిపిస్తుంది. అయితే, ఆమె పుస్తకంలో చదివే పాత్రలన్నీ దెయ్యాలుగా మారి ఒక్కొక్కటిగా తన ముందుకు వస్తుంటాయి. అలా, ఆమె ముందుకు వచ్చిన ఓ పాత్ర కార్తీక (కాజల్‌). గ్రామస్థుల వల్ల మరణించిన కార్తీక పగ, ప్రతీకారాలతో రగిలిపోతుంటుంది. మరి, ఆమె పగ ఎలా తీరింది..? కార్తీక (రెజీనా), కథలో ఉన్న కార్తీక (కాజల్‌)కు ఉన్న సంబంధం ఏమిటి..? అనే ఆసక్తికర విషయాలతో ఈ సినిమా తెరకెక్కింది. జననీ అయ్యర్‌, నోయిరికా, రైజూ విల్సన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని