కల్కి.. పాట వచ్చేస్తోంది

‘కల్కి 2898ఎ.డి’తో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు ప్రభాస్‌.

Published : 19 May 2024 00:49 IST

‘కల్కి 2898ఎ.డి’తో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు ప్రభాస్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రాన్ని నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించారు. వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మించింది. దీపిక పదుకొణె కథానాయిక. కమల్‌హాసన్, అమితాబ్‌ బచ్చన్, దిశా పటానీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్‌ 27న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని పదునెక్కిస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈనెల 22న ప్రత్యేక ప్రచార చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికోసం రామోజీ ఫిల్మ్‌ సిటీలో భారీ వేడుకను నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమంలోనే అభిమానుల మధ్య పాటను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ వేడుకలో ప్రభాస్‌తో పాటు చిత్ర బృందమంతా పాల్గొననుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని