Kalki: ట్రెండింగ్‌లో ‘కల్కి’.. లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ ఇవే..

‘కల్కి’ చిత్రబృందం అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది.

Published : 05 Jun 2024 13:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి. వాటితో పాటు ‘కల్కి’ హ్యాష్ ట్యాగ్‌ కూడా ఎక్స్‌లో ట్రెండింగ్ అవుతోంది. దీనికి కారణం సినీప్రియులను ఖుష్ చేస్తూ.. ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రబృందం ఓ అప్‌డేట్‌ను పంచుకోవడమే. ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన   ఈ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఓ క్రేజీ అప్‌డేట్‌ను పంచుకుంది మూవీ యూనిట్‌.

ఈ సినిమా ట్రైలర్‌ జూన్‌ 10న విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ఓ కొత్త పోస్టర్‌ను షేర్‌ చేసింది. ఇప్పటికే విడుదలైన దీని టీజర్‌, ప్రత్యేక వీడియోలు విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇప్పుడు ట్రైలర్‌ వాటిని రెట్టింపు చేయడం ఖాయమని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ట్రైలర్‌ను థియేటర్‌లో ప్రదర్శించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఏపీలో ఎక్కువ థియేటర్‌లలో దీన్ని ప్రదర్శించాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. జూన్‌ 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను భారీ స్థాయిలో దీన్ని నిర్వహించాలని ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. అది కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పోటీ ఎప్పుడూ ఉంటుంది.. మరింత కష్టపడి పనిచేస్తా: సమంత

మరోవైపు కల్కి టీమ్‌ ప్రమోషన్‌ జోరు పెంచింది. సినీ సెలబ్రిటీల పిల్లలకు ఈ సినిమాలోని బుజ్జి, భైరవాల గిఫ్ట్‌లను పంపుతోంది. ఇప్పటికే రామ్ చరణ్‌, మహేశ్‌బాబు కుమార్తెలు ఈ బహుమతి అందుకోగా.. తాజాగా స్టార్‌ హీరో యశ్‌ పిల్లలు కూడా బుజ్జి-భైరవ స్టికర్లు అందుకున్నారు. త్వరలోనే మరికొంతమంది ఈ బహుమతులు అందుకోనున్నారు. ప్రచారంలో భాగంగానే తాజాగా ‘బుజ్జి అండ్‌ భైరవ’ పేరుతో టీమ్‌ యానిమేటెడ్‌ సిరీస్‌ తీసుకొచ్చింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సిరీస్‌కు మంచి ప్రేక్షకాదరణ వచ్చింది. ప్రభాస్ సరసన దీపిక పదుకొణె (Deepika Padukone) నటిస్తుండగా.. సీనియర్‌ హీరో కమల్‌హాసన్‌ విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. అలాగే అమితాబ్‌ బచ్చన్‌, పశుపతి, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని