Devil: డెవిల్‌ రాక ఆరోజే..

నందమూరి కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘డెవిల్‌’ విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 29న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు గురువారం ప్రకటించాయి.

Updated : 08 Dec 2023 09:30 IST

నందమూరి కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘డెవిల్‌’ విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 29న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు గురువారం ప్రకటించాయి. అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది. కల్యాణ్‌రామ్‌కి జోడీగా సంయుక్త మేనన్‌ నటించారు. పీరియాడికల్‌ స్పై థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా కల్యాణ్‌రామ్‌ సందడి చేయనున్నారు. ‘‘కల్యాణ్‌రామ్‌ ఇప్పటివరకూ చేయని జానర్‌ ఇది. డెవిల్‌ పాత్రలో ఒదిగిపోయిన విధానం ఆకట్టుకుంటుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాం. అంచనాలకి దీటుగా చిత్రం ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. తెలుగుతోపాటు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్‌ప్లే: శ్రీకాంత్‌ విస్సా, సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, ఛాయాగ్రహణం:  సౌందర్‌రాజన్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌: గాంధీ నడికుడికర్‌, కూర్పు: తమ్మిరాజు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని