Kamal Haasan: గర్వంగా ఉంది బ్రదర్‌: పవన్‌ కల్యాణ్‌కు కమల్‌ హాసన్‌ విషెస్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కమల్‌ హాసన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Published : 08 Jun 2024 00:06 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)కు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన్ను అభినందించగా తాజాగా కోలీవుడ్‌ అగ్ర నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) విషెస్‌ తెలిపారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

మోదీతో అకీరా.. ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టిన రేణూదేశాయ్‌

‘‘ఎన్నికల్లో విజయం అందుకున్న పవన్‌ కల్యాణ్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపా. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఆయన చేస్తున్న ప్రయాణానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పా. సంభాషిస్తూ ఎమోషనల్‌ అయ్యాం’’ అని తెలిపారు. ‘‘మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది బ్రదర్‌’’ అని పేర్కొన్నారు. #PawanKalyan #Victory #Leadership అంటూ హ్యాష్‌ట్యాగ్స్‌ జతచేశారు. ఈ ట్వీట్‌పై ఇరువురి హీరోల అభిమానులు, పలువురు నెటిజన్లు స్పందించారు. మరోవైపు, పవన్‌ కల్యాణ్‌ తుపాను అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. పాత పార్లమెంట్‌ భవనంలో శుక్రవారం జరిగిన ఎన్డీయే ఎంపీల సమావేశంలో ఆయన్ను కొనియాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు