Rolex: ఒకే స్టేజ్‌పై విక్రమ్ - రోలెక్స్.. సినిమా ఫిక్స్ చేసిన లోకేశ్
విక్రమ్ - రోలెక్స్.. గతేడాది బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పేర్లు ఇవి. తాజాగా వీరిద్దరూ ఒకే స్టేజ్‌పై సందడి చేశారు.
చెన్నై: రోలెక్స్ (Rolex).. ఇండస్ట్రీని షేక్ చేసిన ఓ పాత్ర పేరు ఇది. కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన ‘విక్రమ్’(Vikram)లో సూర్య (Suriya) పోషించిన ఈ పాత్రకు సినీ ప్రియులు ఎంతగానో ఫిదా అయ్యారు. ఇదే విషయంపై తాజాగా కమల్ హాసన్ మాట్లాడారు. చెన్నైలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న కమల్‌హాసన్.. ఓ విభాగంలో సూర్యకు అవార్డు అందించారు.
‘‘రోలెక్స్ పాత్ర.. మా సినిమా మరెంతో మందికి చేరువయ్యేలా చేసింది. ఈ పాత్ర చేయడానికి అంగీకరించినందుకు సూర్యకు మరోసారి ధన్యవాదాలు. ఇది మేము చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం. ఒక్క ఫోన్‌కాల్ చేసిన వెంటనే సూర్య ఈ పాత్ర చేయడానికి ఓకే అన్నాడు’’ అంటూ సూర్యని హత్తుకుని ఆయన నుదిటిపై కమల్ ముద్దుపెట్టుకున్నారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘విక్రమ్ - రోలెక్స్‌ను ఒకే స్టేజ్‌పై చూడటం ఆనందంగా ఉంది’ అంటూ నెటిజన్లు అంటున్నారు.
సూర్యతో సినిమా : లోకేశ్
సూర్యతో సినిమా చేయడంపై ‘విక్రమ్’ దర్శకుడు లోకేశ్ (Lokesh) క్లారిటీ ఇచ్చారు. తాను త్వరలోనే సూర్యతో ఓ సినిమా చేస్తానని అన్నారు. ‘‘సూర్యతో ప్రాజెక్ట్ చేయాలని నాక్కూడా ఆసక్తిగా ఉంది. తప్పకుండా ఆయనతో సినిమా చేస్తా. 150 రోజుల్లోనే దాన్ని పూర్తి చేస్తా’’ అని ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యల పట్ల సూర్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, లోకేశ్ ప్రస్తుతం విజయ్‌తో ‘లియో’ (LEO) చేస్తోన్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
భార్య, అత్త, బావమరిదిని కోల్పోయాడు.. చివరి క్షణంలో ఆగడంతో బతికిపోయాడు!
-
India News
సిగ్నలింగ్ వ్యవస్థలో తీవ్ర లోపాలు.. 3 నెలల క్రితమే హెచ్చరించిన రైల్వే ఉన్నతాధికారి
-
Ap-top-news News
Tirumala: ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకే బ్రేక్ దర్శనాలు
-
Crime News
Khammam: దంత వైద్య విద్యార్థిని ఆత్మహత్య!.. మంటల్లో కాలిపోతుండగా గుర్తింపు..
-
Sports News
Lionel Messi: చిరునవ్వుతో టాటా.. పీఎస్జీని వీడిన మెస్సి