Kamal Haasan: ధోనీపై కమల్‌ ప్రశంసలు.. క్రిస్‌గేల్‌తో రిషబ్‌ ఫొటో

ధోనీపై కమల్‌ హాసన్‌ ప్రశంసలు కురిపించారు. క్రిస్‌గేల్‌తో కలిసి దిగిన ఫొటోను రిషబ్‌ షేర్‌ చేశారు.

Published : 19 May 2024 15:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోలు క్రికెటర్ల గురించి మాట్లాడినా.. క్రికెటర్లు- హీరోలు ఏదైనా వేదికపై కలిసినా సినీ, క్రీడా అభిమానులకు అదో ఆనందం. సంబంధిత ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ సంబరపడుతుంటారు. ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) తన కొత్త సినిమా ‘ఇండియన్‌ 2’ (భారతీయుడు 2) ప్రచారంలో భాగంగా ‘స్టార్స్‌ స్పోర్ట్స్‌’ ఛానల్‌కు వెళ్లి.. సినిమా సంగతులు పంచుకున్నారు. తన అభిమాన క్రికెటర్‌ ఎం.ఎస్‌. ధోనీ (MS Dhoni)ని కొనియాడారు. అతడి ప్రయాణం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. మరోవైపు, బెంగళూరు వేదికగా శనివారం జరిగిన బెంగళూరు vs చెన్నై మ్యాచ్‌ చూసేందుకు కన్నడ నటుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) స్టేడియానికి వెళ్లారు. అక్కడ.. వెస్టిండీస్‌ స్టార్‌ ప్లేయర్‌ క్రిస్‌ గేల్‌తో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ని నేరుగా స్టేడియంలో కూర్చొని చూడడం తొలిసారి అని పేర్కొన్నారు. ‘సూపర్‌’, ‘పిక్చర్‌ పర్‌ఫెక్ట్‌’ అంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు పెడుతున్నారు. 

కమల్‌ హాసన్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కించిన ‘భారతీయుడు 2’ (Bharateeyudu) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొంది, హిట్‌గా నిలిచిన ‘భారతీయుడు’కు సీక్వెల్‌ ఇది. కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సిద్ధార్థ్‌ కీలక పాత్రలు పోషించారు. ‘కాంతార’తో హీరోగా, డైరెక్టర్‌గా ఘన విజయాన్ని అందుకున్న రిషబ్‌ ప్రస్తుతం దాని ప్రీక్వెల్‌ పనుల్లో బిజీగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు