Kamal Haasan: మూడు చిత్రాల అప్‌డేట్స్ ఇచ్చిన కమల్‌ హాసన్‌.. ‘కల్కి’ గురించి ఏమన్నారంటే!

తాను నటిస్తోన్న సినిమాల అప్‌డేట్‌లను కమల్‌ హాసన్‌ పంచుకున్నారు.

Updated : 25 Mar 2024 10:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ర కథానాయకుడు కమల్‌ హాసన్ (Kamal Haasan) సినీ ప్రియుల్లో జోష్‌ నింపారు. తాను నటిస్తోన్న మూడు చిత్రాల అప్‌డేట్స్‌ను షేర్‌ చేశారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఆయన తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘కల్కి’, ‘థగ్‌ లైఫ్‌’, ‘ఇండియన్‌2’ షూటింగ్‌ల గురించి వెల్లడించారు. మంచి సినిమాను అందించడం కోసం చిత్రబృందాలు ఎప్పుడూ తాపత్రయపడుతుంటాయని తెలిపారు. ఆలస్యమైనప్పటికీ  క్వాలిటీ విషయంలో రాజీపడడం లేదన్నారు. ‘‘ఇండియన్‌2, ‘ఇండియన్‌3’ రెండింటి షూటింగ్‌ పూర్తి చేశాం. ప్రస్తుతం ‘ఇండియన్2’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. అది అయ్యాక దాని సీక్వెల్‌ పోస్ట్ ప్రోడక్షన్‌ పనులు ప్రారంభిస్తాం. ఎన్నికల హడావిడి అయ్యాక మణిరత్నం ‘థగ్‌ లైఫ్‌’ (Thug Life) చిత్రీకరణ మొదలుపెడతాం. ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)లో నేను అతిథి పాత్రలో నటించాను. నా భాగం షూటింగ్‌ పూర్తయింది’ అని చెప్పారు.

వీటితో పాటు శ్రుతిహాసన్‌, దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj)ల స్పెషల్‌ సాంగ్‌కు కమల్‌ వర్క్ చేశారు.  ‘ఇనిమేల్’ అంటూ సాగే ఈ పాటకు ఆయన లిరిక్స్‌ అందించారు. ద్వారకేశ్‌ ప్రభాకర్‌ దర్శకత్వం వహించిన ఈ పాట నేడు (మార్చి 25) విడుదల కానుంది. అలాగే ధనుష్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఇళయరాజా బయోపిక్‌లోనూ కమల్‌ హాసన్‌ భాగం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజ జీవిత పాత్రలో తళుక్కున మెరవడమే కాకుండా స్క్రీన్‌ప్లే అందిస్తున్నట్లు సమాచారం. దర్శకుడు అరుణ్‌తో కలిసి స్క్రిప్ట్‌ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇళయరాజాపై అభిమానంతోనే కమల్‌ ఈ జీవిత కథలో నటించనున్నారని కోలీవుడ్‌ మీడియా వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని