Daniel Balaji: డేనియల్ బాలాజీ మృతికి సినీ ప్రముఖుల సంతాపం

ప్రముఖ తమిళ నటుడు డేనియల్‌ బాలాజీ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

Published : 30 Mar 2024 18:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ తమిళ నటుడు డేనియల్‌ బాలాజీ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 

డేనియల్ బాలాజీ ఆకస్మిక మరణం దిగ్భ్రాంతికరమైనది. తన కళ్లను దానం చేసి ఎదుటివారి జీవితాల్లో వెలుగుల్ని నింపారు. భౌతికంగా మన మధ్యన లేకున్నా ఆయన ఎప్పటికీ బతికే ఉంటారు. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. - కమల్‌ హాసన్‌                      

డేనియల్‌ బాలాజీ ఎంతో దయార్థ హృదయుడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పటినుంచి నాలో మంచి నటుడు ఉన్నారంటూ నన్ను ప్రోత్సహించేవారు. చాలా ఆడిషన్స్‌కు పంపారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి అన్న.       -  సందీప్‌ కిషన్‌  

మీ మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. మీతో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. మీ కుటుంబసభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి.   - సూర్య                                                            

డేనియల్‌ బాలాజీ మరణ వార్త విని నేను చాలా షాక్‌ అయ్యాను. మంచి మనసు, ప్రతిభ ఉన్న వ్యక్తి లోకం విడిచివెళ్లిపోవడం తీరని విషాదం.           - లావణ్య త్రిపాఠి                                                              

చాలా తొందరగా మమ్మల్ని విడిచి వెళ్లిపోయావు. మీ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. నీ ఆత్మకు శాంతి చేకూరాలి సోదరా.  - నానీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని